Akhanda 2 Latest Teaser: మరికొద్ది గంటల్లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం మన ముందుకు రాబోతుంది. రాత్రి 8 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ తో థియేటర్స్ కళకళలాడబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. అయితే నిన్న రాత్రి మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించి ఒక రిలీజ్ టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ లోని ఒక షాట్ పై సోషల్ మీడియా లో ట్రోల్స్ మామూలు రేంజ్ లో లేవు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ షాట్ పై ట్రోల్స్ వేస్తూ మీమర్స్ ఫుట్ బాల్ ఆడేస్తున్నారు. ఆ ట్రోల్స్ ని చూసే బాలయ్య ఫ్యాన్స్ కూడా నవ్వుకుంటారేమో, అంత ఫన్నీ గా ఉన్నాయి. మనిషిని తలక్రిందులుగా చేసి, అరచేతిలో పట్టుకొని, గుమ్మడి కాయతో దిష్టి తీసినట్టు తీసి, నేలకేసి కొట్టడం నందమూరి ఫ్యాన్స్ కి మాస్ అనిపించొచ్చు కానీ, ఇతర హీరోల అభిమానులకు కచ్చితంగా కామెడీ నే.
త్రిసూలం మెడకు తగిలించి ఫ్యాన్ ని తిప్పినట్టు తిప్పుతూ విలన్స్ ని చంపడం, అదే త్రిసూలం తో స్టెన్ గన్ ని కాల్చడం, కాళ్లతో నెల మీద కొడితే మనుషులు వస్తువులు లాగా పైకి లేయడం, ఒక్క త్రిసూలం తో పది మంది విలన్స్ ని ఒంటి చేతితో పైకి లేపడం, ఇలా ఒక్కటా రెండా, సినిమా మొత్తం బోయపాటి ఇలాంటి సన్నివేశాలతోనే నింపేసి ఉన్నట్టు విడుదలైన రెండు ట్రైలర్లు, మూడు టీజర్స్ ని చూస్తే తెలుస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే, కచ్చితంగా మాస్ సన్నివేశాలు ఉంటాయని అందరూ ఊహిస్తారు. కానీ మరీ ఈ రేంజ్ ఓవర్ డోస్ మాస్ సన్నివేశాలను ఎవరు మాత్రం భరిస్తారు చెప్పండి. విడుదల చేసిన రెండు మూడు టీజర్స్ లోనే ఇలాంటి కంటెంట్ ఉంటే, ఇక సినిమా మొత్తం మీద ఎలాంటి ఆణిముత్యాలు ఎన్ని ఉంటాయో మీరే ఊహించుకోండి.
ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయిన కొన్ని ఫన్నీ ట్రోల్ వీడియోస్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే ఈ సినిమాలో కేవలం మాస్ సన్నివేశాలు మాత్రమే కాదు, సెంటిమెంట్ సన్నివేశాలు కూడా ఓవర్ డోస్ లోనే ఉంటాయట. మరి ఈ రేంజ్ ఓవర్ డోస్ ని ఆడియన్స్ తట్టుకోగలరా లేదా అనేది చూడాలి. ఒకవేళ తట్టుకుంటే మాత్రం వాళ్ళ ఓపికకి దండం సలాం కొట్టొచ్చు. ‘అఖండ’ చిత్రం లో కూడా ఓవర్ డోస్ మాస్ సన్నివేశాలు ఉన్నాయి కానీ, అందుకు తగ్గ ఎమోషన్స్ కూడా సమానంగా ఉన్నాయి. అందుకే ఆ చిత్రం కమర్షియల్ గా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మరి ఈ సినిమాకు ఆడియన్స్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram