Balayya: పురాణ కాలం నుండి వృద్ధాప్యం అనేది పెద్ద సమస్యగా చిత్రీకరించారు పెద్దలు. నిత్య యవ్వనంగా ఉండడానికి, చావు లేకుండా కలకాలం బ్రతకడానికి దేవతలు అమృతం తాగేవారట. మరి దేవతలను ఓడించడానికి రాక్షసులకు కూడా అమృతం అవసరమైంది. అందుకే సురులు, అసురులు క్షీర సాగర మధనం చేసి అమృతం బయటికి తీశారు. పాపం అసురులు విష్ణు మాయలో చిక్కి, అమృతం కోల్పోయారు. దీన్ని ఆధునిక తరం పుక్కిటి పురాణంలా కొట్టిపారేసినా.. కాన్సెప్ట్ లో రియాలిటీ ఉంది. వయసు మీద పడటం అంటే మనుషులు భయపడిపోతారు. వయసు పెరగడం అంటే ఆయువు తరగడమే అని గ్రహించి విచారం వ్యక్తం చేస్తారు.

ముఖ్యంగా వృద్దాప్యం వలన అందం పోతుందని తెగ దిగులు పడిపోతారు. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న తారలకు ఈ భయం మరింతగా ఉంటుంది. ఈ విషయంలో హీరోయిన్స్ కి మించి ఎక్కువగా బాధపడుతున్నాడు బాలకృష్ణ. నందమూరి అందగాడుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న బాలయ్యకు అందం అంటే మహా పిచ్చి. అలాగే నిత్య యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. ఎప్పుడూ కలర్ ఫుల్ ట్రెండీ డ్రెస్ లలో దర్శనం ఇస్తారు. జీన్స్, టీ షర్ట్స్, షర్ట్స్ లో ఎక్కువగా కనిపిస్తారు. సాధ్యమైనంత వరకు వయసు తక్కువ కనపడేలా జాగ్రత్త పడతారు.
Also Read: బాలయ్య “అఖండ” సినిమా తొలిరోజు కలెక్షన్ ఎంతంటే…
ఇక రెండు దశాబ్దాల క్రితమే బాలయ్యకు జుట్టు పోయింది. అప్పటి నుండి విగ్గుతో మ్యానేజ్ చేస్తున్నారు. వేదిక ఏదైనా విగ్గులు లేకుండా కాలు బయటపెట్టరు. అలాగే తన ప్రవర్తన కూడా యువకుడిగా ఉండేలా చూసుకుంటాడు. వేదికలపై బాలయ్య ఎనర్జీ ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే నా అందం పోతుందేమో అనే ఫోబియా బాలయ్యను వేటాడుతుంది అనేది నిజం. ముంచుకొస్తున్న వృద్ధాప్యం బాలయ్యను మానసిక వేదనకు గురి చేస్తుంది.
బాలయ్య ఇక్కడ గ్రహించవలసిన విషయం ఒకటుంది. వయసుతో వచ్చే మార్పులను ఎవరైనా అంగీకరించాల్సిందే. బాలయ్యకు 60 ఏళ్ళు దాటిపోయాయి. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి, మనవళ్లకు తాత అయ్యాడు. తాత వయసులో ఉన్న బాలయ్యను ఎవరైనా అంకుల్ అని పిలిచినా కోపం వచ్చేస్తుంది. ఆ మధ్య ఓ మూవీ లాంచ్ ఈవెంట్ ల పాల్గొన్న బాలయ్యను ఆ సినిమా నటుడు అంకుల్ అని పిలిచారు. దానితో ఒక్కసారిగా కోపానికి గురైన బాలయ్య పబ్లిక్ లో ఉన్న విషయం కూడా మరిచి అతని వైపు ఉరిమి చూశాడు. ఇక తాజాగా అఖండ మూవీ చూసిన కొందరు పిల్లలు సినిమా చాలా బాగుంది అంకుల్ అన్నారట. వాళ్ళు నన్ను అంకుల్ అనడం బాధేసిందంటూ బాలయ్య కామెంట్ చేశారు. ఇవన్నీ గమనిస్తుంటే ఓల్డ్ ఏజ్ ఫోబియా బాలయ్యను వెంటాడుతుందన్న భావన కలుగుతుంది
Also Read: బాలయ్య వసూళ్ల ప్రభంజనం… వకీల్ సాబ్ కి చెక్ పెట్టిన అఖండ!