Hero Nani vs AP GOVT: అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నించే వాడే ఉండకూడదని అధికార వైసీపీ డిసైడ్ అయినట్టు ఉంది.. దేశంలో ఎవరు ఏది ఉత్పత్తి చేసిన దానికి ధరను నిర్ణయించే అధికారం వారికే ఉంటుంది. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల.. ఆఖరుకు ఓటీటీలు కూడా సినిమాలు చూపించినందుకు నెలకు ఇంత అని వసూలు చేస్తున్నాయి.మరి కోట్లు పెట్టి సినిమా తీసి థియేటర్లో వసతులు కల్పించి రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు వాళ్ల సినిమా టికెట్లు వాళ్లు నిర్ణయించుకునే స్వేచ్ఛ లేకపోవడం దౌర్భగ్యమే. సినీ ఇండస్ట్రీ అనేది పూర్తిగా ప్రైవేటు వ్యవస్థ. తీసేది, ప్రదర్శించేది అంతా ప్రైవేటు నిర్వాహకులే. దీనిపై ప్రభుత్వ పెత్తనం ఏంటన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న.
తాజాగా యంగ్ హీరో నాని తన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ ప్రమోషన్ లో భాగంగా ఏపీలో తక్కువ టికెట్ రేట్లపై బరస్ట్ అయ్యాడు. “ఇది ప్రేక్షకులను అవమానించేది కాదు. భారతదేశంలోని ఏదైనా ఉత్పత్తిపై ఎమ్మార్పీ ఉన్నప్పుడు, గరిష్ట రిటైల్ ధర లేకుండా సినిమా టిక్కెట్లను ఎందుకు విక్రయించకూడదు?’’ అని ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల పరిస్థితిపై హీరో నాని ఈరోజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి గట్టిగానే తగిలాయి.
ఇప్పటివరకూ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రశ్నించాడు. అతడిపై పోసాని లాంటి వారితో దారుణంగా కౌంటర్లు ఇచ్చారు. ఇక అగ్రహీరోలు, నిర్మాతలు దీనిపై స్పందించింది లేదు. అయితే తాజాగా హీరో నాని దీనిపై తొలి సారి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఈ నిర్ణయం సరైంది కాదు. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరణాషాపుల కలెక్షన్ ఎక్కువగా ఉంది. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదమే అవుతుంది’ అని నాని సుతిమెత్తగా సమస్యను ఎత్తి చూపారు.
అయితే నాని ఇలా అన్నాడో లేదో అలా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ లైన్లోకి వచ్చాడు. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు సరిపోవని సినీ పరిశ్రమ భావిస్తే ఇలా మీడియా ముందు ప్రకటనలు ఇవ్వకుండా సీఎం జగన్ కు ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
Also Read: నాని వ్యాఖ్యల వల్ల స్టార్ హీరోలకే ఇబ్బంది !
కోట్లు పెట్టి సినిమాలు తీసి తమ సినిమాకు తాము ధర నిర్ణయించక ప్రభుత్వాన్ని బతిమిలాడుకోవడం అంటే ఎవరి ఇగో అయినా హర్ట్ అవుతుంది. ఇప్పుడు బొత్స కూడా జగన్ ను బతిమిలాడుకుంటే టికెట్ ధరలు పెంచనిస్తారని అన్నట్టుగా ఆయన మాటలున్నాయి.
ఇది ప్రజాస్వామ్య దేశం.. ఏదో రాచరికంలో ఉన్నట్టు జగన్ ను బతిమిలాడుకుంటే టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చు అని బొత్స చేసిన ప్రకటన ఇప్పుడు దుమారం రేపుతోంది. టాలీవుడ్ ఏపీ ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై బతుకుతోందా? అన్న కౌంటర్లు పడుతున్నాయి. మరి నానితోనే ఈ ప్రశ్నల వర్షం ఆగుతుందా? ఇతర అగ్రహీరోలు ఈ టికెట్ రేట్లపై స్పందిస్తారా? అన్నది వేచిచూడాలి.
Also Read: హీరో నాని సంచలన నిర్ణయం… ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే