YCP Criticize OG Movie: నేటి కాలంలో రాజకీయ నాయకులు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. పైగా సోషల్ మీడియా విస్తృతి, మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆరోపణలు చేయడంలో సరికొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. తద్వారా ఓవర్ నైట్ లోనే సోషల్ మీడియాలో స్టార్ అయిపోతున్నారు. అటువంటి నాయకుడు గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఇంతకీ ఆయన అన్న మాటలు ఏంటి.. ఏ విషయంలో అన్నారు.. దీనివల్ల ఏం జరిగింది అనేది.. ఈ కథనంలో తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. ఈ సినిమాను జనసేన నాయకులు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సినిమా బాగుందని.. సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని.. పాత రికార్డులను బద్దలు కొడుతోందని.. చాలాకాలం తర్వాత పాత పవన్ కళ్యాణ్ ను చూసామని వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పటిలాగే దీనిపై వైసీపీ నేతలు విష ప్రచారం మొదలుపెట్టారు. సినిమాను సినిమా మాదిరిగా చూడకుండా.. అదేదో నేరమైనట్టు.. ఘోరమైనట్టు చెబుతున్నారు. తమ పార్టీ పత్రిక, పార్టీ చానల్లో అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో హరిహర వీరమల్ల విడుదలైనప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. పాపం వైసిపి ఇప్పట్లో పక్కా ప్రొఫెషనల్ రాజకీయాలు చేయలేదనుకుంటా.
ఓజీ సినిమాకు టికెట్ల ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం నిర్మాతలకు సూచించింది. ఈ వ్యవహారాన్ని అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రసారం చేశాయి. కొన్ని చానల్స్ ఏకంగా డిబేట్ లు కూడా పెట్టాయి. అందులో ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కూడా ఉంది. ఆర్ డిబేట్ కార్యక్రమానికి వైసీపీ నుంచి వెంకటరెడ్డి అనే నాయకుడు హాజరయ్యారు.. జనసేన నుంచి బండారు వంశీకృష్ణ కూడా హాజరయ్యారు. వీరిద్దరి మధ్య వాదాలు జరిగాయి. తాను ఎట్టి పరిస్థితుల్లో ఓజి సినిమా చూడబోనని.. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మాత్రమే చూస్తానని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై వంశీకృష్ణ కూడా అదే స్థాయిలో స్పందించారు. “వెంకట రెడ్డి గారు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటే యూట్యూబ్ లో వివేకం అని ఉంటుంది. దానిని చూడండి. దానివల్ల మీకు మెసేజ్ బాగా వస్తుందని” వ్యాఖ్యానించారు.. దీనికి సంబంధించిన వీడియోను జనసేన నాయకులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలకు ఈ సమాధానం ద్వారా జ్ఞానోదయం అవుతుందని పేర్కొంటున్నారు.
“పవన్ కళ్యాణ్ గారి #OG సినిమాకి వెళ్తారా వెంకటరెడ్డి గారు?”
️ YSRCP జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి:
“నేను ఆ సినిమాకి వెళ్ళను… ఏదైనా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాకు వెళ్తా.”TDP ప్రతినిధి బండారు వంశీకృష్ణ:
“అయితే వెంకటరెడ్డి గారు YouTube లో వివేకం సినిమా చూడాలి… మాంచి… pic.twitter.com/D4zalbzjmy— SBS (@SBSUSA007) September 24, 2025