Pushpa 2: మెగా-అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వాదన చాలా కాలంగా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూర్చాయి. జనసేన కూటమిలో చేరింది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ప్రత్యర్థి పార్టీగా ఉన్న వైసీపీకి అల్లు అర్జున్ పరోక్షంగా మద్దతు పలకడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ పరిణామం అనంతరం కొన్ని వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోవైపు మెగా ఫ్యాన్స్ లోని ఓ వర్గం అల్లు అర్జున్ పై కోపంగా ఉన్నారు. పుష్ప 2ని వారు అవైడ్ చేసే సూచనలు కలవు. అయితే ఈ పరిస్థితిని వైసీపీ నేతలు క్యాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. వారు అల్లు అర్జున్ కి, పుష్ప 2 చిత్రానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు.. పుష్ప 2 చిత్రాన్ని ఎవరూ ఆపలేరని కామెంట్స్ చేశారు.
అయితే ఇదంతా అల్లు అర్జున్ మీద వైసీపీ నేతలకు కపట ప్రేమ మాత్రమే అని ఓ వర్గం వాదిస్తుంది. పుష్ప పార్ట్ 1 విడుదల సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వారు గుర్తు చేస్తున్నారు. 2021 లో పుష్ప విడుదలైంది. అప్పుడు ఏపీలో టికెట్స్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. పుష్ప చిత్రానికి ఎలాంటి హైక్ ఇవ్వలేదు. అలాగే స్పెషల్ షోస్ కి కూడా అనుమతులు నిరాకరించారు. దీని వలన పుష్ప ఏపీలో భారీగా వసూళ్ళు నష్టపోయింది.
టికెట్స్ హైక్స్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, పుష్ప ఇంకా భారీ విజయం సాధించేది ఫ్యాన్స్ భావించారు. అప్పుడు అల్లు అర్జున్ చిత్రాన్ని దెబ్బ తీసిన వైసీపీ నేతలు ఇప్పుడు, పుష్ప 2 కి మద్దతుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. వైసీపీ నేతల ట్రాప్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పడకండని హితవు పలుకుతున్నారు.
కాగా పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్. ఫహద్ ఫాజిల్ ప్రధాన విలన్ గా చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.