Yashoda Teaser: అసలే ఇవి ఓటిటి రోజులు. మితిమీరిన హీరోయిజం, లాజిక్ లేని కథా, కథనాలు ఉన్న సినిమాలను జనం ఈడ్చి కొడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్..ఇలా ఏ ఉడ్ చూసుకున్నా ఇదే పరిస్థితి. అందుకే బింబిసార, సీతారామం, కార్తికేయ 2, ఒకే ఒక జీవితం.. వంటి సినిమాలు ప్రేక్షకుల మదిని గెలుచుకున్నాయి. అదే సమయంలో రాధే శ్యామ్, ఆచార్య, లైగర్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు వారం రోజుల్లోనే స్టోర్ రూమ్ కి వెళ్ళిపోయాయి. ఫిల్మ్ మేకర్లు ఎంత సొంత డబ్బా కొట్టుకున్నా ప్రేక్షకులు దేఖే పరిస్థితి లేదు. గ్రిప్పింగ్ గా ఉన్న కథనం, అలరించే కథ ఉంటేనే సినిమాను చూసేందుకు ఇష్టపడుతున్నారు.

సమంత రూటు మార్చింది
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత హీరోయిన్ సెంట్రిక్ గా ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నది. పుష్పలో ఐటమ్ సాంగ్ ను మినహాయిస్తే ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఖుషి, యశోద, శాకుంతలం అనే సినిమాలు ఉన్నాయి. వీటిలో ఖుషి సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఈయన దర్శకత్వంలోనే నాగచైతన్య , సమంత జంటగా మజిలీ అనే సినిమా వచ్చింది. ఇక శాకుంతలానికి గుణశేఖర్, యశోద సినిమాకు హరి- హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం సమంత ముంబైలో ఉంటున్నారు.
శత్రువుల నుంచి సమంతకు ప్రమాదం
అయితే హరి- హరీష్ దర్శకత్వంలో యశోద సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో సమంతకు జంటగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించారు. ” కంగ్రాట్స్ నువ్వు ప్రెగ్నెంట్. ఈ మూడు నెలలు నువ్వు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.

బరువులు ఎత్తకూడదు. కఠినమైన పనులు చేయకూడదు. దెబ్బలు తగిలించుకోకూడదు” అని డాక్టర్ చెప్పే మాటలతో ఈ సినిమా టీజర్ సాగింది. అయితే టీజర్ ప్రకారం ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతున్నది. సమంతను ఎవరో వెంటపడుతూ తరుముతున్నారు. అంటే ఆమెకు, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉందని అర్థం అవుతుంది. సినిమా టీజర్ చాలా గ్రిప్పింగ్ ఉండడంతో ప్రేక్షకుల్లో ఒక అంచనాలు ఏర్పడ్డాయి. మురళి శర్మ, వరలక్ష్మి, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. టీజర్ లో సమంత చేసిన పోరాటాలు వావ్ అనిపించేలా ఉన్నాయి. ఆమె నటన కూడా గత చిత్రాల కంటే భిన్నంగా ఉంది. అయితే ఇటీవల ఆమె మీద వస్తున్న ఆరోపణలకు బలమైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా అంగీకరించారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.