Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: నయనీ పావని రంగు పై యష్మీ సంచలన కామెంట్స్..'రెడ్ కార్డ్'...

Bigg Boss Telugu 8: నయనీ పావని రంగు పై యష్మీ సంచలన కామెంట్స్..’రెడ్ కార్డ్’ ఇవ్వనున్న బిగ్ బాస్?..వైరల్ అవుతున్న వీడియో!

Bigg Boss Telugu 8: నిన్న జరిగిన రీ లోడ్ ఎపిసోడ్ ద్వారా హౌస్ లోకి గత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళ రాకతో హౌస్ లో ఒక కొత్త కల వచ్చింది. టాస్కులు కూడా ఇక నుండి చాలా కఠినంగా ఉండబోతున్నాయి అనేది నిన్ననే అర్థం అయ్యింది. నిన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మరియు పాత కంటెస్టెంట్స్ మధ్య నాలుగు టాస్కులు పెట్టారు. ఈ నాలుగు టాస్కులలో మూడు వైల్డ్ కార్డ్స్ గెలవగా, ఒక్కటి పాత కంటెస్టెంట్స్ గెలిచారు. దీంతో వైల్డ్ కార్డ్స్ కి నామినేషన్స్ నుండి ఇమ్మ్యూనిటీ లభించింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ లో వైల్డ్ కార్డ్స్ ఎక్కువగా యష్మీ ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. 8 మందిలో అత్యధిక శాతం ఆమెకే ఓట్లు వేశారు. దీనికి యష్మీ బాగా బాధపడిందో, లేకపోతే వాళ్ళ మీద కోపం పెంచుకుందో తెలియదు కానీ, నయనీ పావని పై నోరు జారేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే పృథ్వీ, యష్మీ మరియు విష్ణు ప్రియ ఒక దగ్గర కూర్చొని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో నయనీ పావని టాపిక్ వాళ్ళ మధ్యలోకి వస్తుంది. పృథ్వీ మాట్లాడుతూ ‘నయనీ ఇంకా మేకప్ తీయలేదు’ అని అంటాడు. దానికి యష్మీ సమాధానం చెప్తూ ‘ఇంకా తీయలేదా?, ఆమె మేకప్ తీస్తే మనం చూడలేం అనుకో’ అని బదులిస్తుంది. ఆ తర్వాత పృథ్వీ, విష్ణు ప్రియ నవ్వగా , యష్మీ మాట్లాడుతూ ‘ఎందుకురా నవ్వుతున్నారు..తనకు ఉన్న అందం గురించి ఆమె గర్వంగా ఫీల్ అవ్వాలి, ఎవరికైనా అంతే కదా’ అని అంటుంది. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అప్పట్లో మణికంఠ ని మగవాళ్ల లెక్కలోకి వేయకుండా అవమానించింది, ఇప్పుడు నయనీ పావని రంగు పై నీచమైన కామెంట్స్ చేస్తుంది, ఈ వీకెండ్ లో నాగార్జున ఈమెని ప్రశ్నించి కంట్రోల్ చేయకపోతే షోకి ఉన్న పరువు పోతుంది. అసలు ఆమెకు రెడ్ కార్డ్ ఇచ్చి బయటకి పంపేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్స్. యష్మీ ఆవేశం లో నోరు జారడం, ఆ తర్వాత నేనేమి అనలేదు అనడం కొత్తేమి కాదు, మొదటి నుండి ఆమె అలాగే ప్రవర్తిస్తుంది.

ప్రతీ చిన్న విషయానికి అతిగా స్పందించడం, తనని ఎవరైనా నామినేట్ చేస్తే కోపం పెంచుకొని వారం మొత్తం వారిపై పగ చూపించడం వంటివి చేస్తూ వచ్చింది. ఇదంతా బయట నుండి చూసారు కాబట్టే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ యష్మీ ని నేడు నామినేట్ చేసారు. బయట నుండి వచ్చినవాళ్లు తనలోని ఇన్ని తప్పులు చూపిస్తే ‘అయ్యో..నేను ఇంత చెడుగా జనాల్లోకి వెళ్తున్నానా?, నన్ను మార్చుకోవాలి’ అని ఆట తీరుని మార్చుకుంటే అమర్ దీప్ లాగా చివరి వరకు హౌస్ లో కొనసాగగలరు, అలా కాకుండా నేను చేసిందే కరెక్ట్ అనే విధంగా ముందుకు వెళ్తే మాత్రం తొందరగా ఎలిమినేట్ అవుతారు. మరి యష్మీ ఎప్పటికి మారుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular