Toxic Teaser Review: మేకర్స్ ఈమధ్య కాలం లో యూత్ ఆడియన్స్ ని ఆకర్షించడం కోసం అడల్ట్ రేటెడ్ కంటెంట్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు, ట్రెండ్ కి తగ్గట్టుగా వెళ్లడం ఆనవాయితీ, అలా వెళ్తేనే సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ లు చూడగలరు. అయితే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. దానిని దాటినప్పుడు చూసే ఆడియన్స్ కి చిరాకు కలుగుతుంది. నేడు విడుదలైన యాష్(Rocking Star Yash) ‘టాక్సిక్'(Toxic Movie) మూవీ టీజర్ ని చూస్తే అలాగే అనిపించింది. ఈ టీజర్ ని హాలీవుడ్ స్టైల్ లో, హై క్వాలిటీ మేకింగ్ తో తీశారు. ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీ ని చూస్తున్న అనుభూతి కలిగింది. కానీ టీజర్ లో చూపించిన కొన్ని షాట్స్ మాత్రం, వివరించడానికి కూడా కష్టంగా అనిపిస్తున్నాయి, అంత దారుణంగా ఉంది. ఇది యూత్ ఆడియన్స్ అబ్బో అని అనిపించొచ్చు, కానీ మామూలు ఆడియన్స్ కి మాత్రం ఏమి రోత రా ఇది అని అనిపిస్తాది.
టీజర్ వివరాల్లోకి వెళ్తే విలన్ గ్యాంగ్ స్మశానం లో తమకు సంబంధించిన మనిషి శవాన్ని పూడ్చడానికి వస్తారు. అందరూ బాధపడుతున్న సమయం లో హీరో ఒక కారులో వస్తాడు. స్టైల్ గా క్రిందకు దిగుతాడు. అది హీరో అనుకుంటే హీరో కాదు, ఎవరో ముసలాయన దిగుతాడు. దిగిన వెంటనే ఆయన బాంబు ఫిక్స్ చేస్తాడు. కారు డిక్కీ కి ట్రిగ్గర్ ని తగిలిస్తాడు. ఇక హీరో హీరోయిన్ తో కారు లో ఘాటు రొమాన్స్ చేస్తూ ఉంటాడు, కారు ఊగుతూ ఉంటుంది, అలా ట్రిగ్గర్ కూడా క్లిక్ అయ్యి బాంబు పేలుతుంది, విలన్స్ అందరూ చనిపోతారు. మిగిలిన వాళ్ళను హీరో గన్ తీసుకొని విచిత్రమైన పద్దతిలో కాలుస్తూ ముందుకు వెళ్తాడు. ఈ టీజర్ ని యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకొని విడుదల చేశారు, కచ్చితంగా వాళ్లకు రీచ్ అవుతుంది.
కానీ కాస్త పరిణీతి చెందిన వాళ్లకు మాత్రం అసలు అమ్మాయి అంటే మగవాళ్లకు ఎలా కనిపిస్తుంది?, ఆట వస్తువులాగా కనిపిస్తుందా?, కోట్లాది మంది చూసే సినిమాల్లో కూడా ఈ విధంగా అమ్మాయిని చూపిస్తే, సమాజం ఏమనుకుంటుంది?, పిల్లలను చెడగొట్టే ఇలాంటి సినిమాలను తక్షణమే బ్యాన్ చెయ్యాలి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించింది. ఈమె ఒక మహిళా, ఒక మహిళా అయ్యుండి ఇలాంటి షాట్స్ తీయడానికి ఆమెకు మనసు ఎలా వచ్చింది? అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఈ చిత్రానికి పేరు మాత్రమే ఆమె దర్శకురాలు, కానీ అసలైన డైరెక్టర్ హీరో యాష్ అని అంటున్నారు. సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన ఈ టీజర్ ని మీరు కూడా చూసేయండి.
