KGF 2 Telugu Movie Review: తారాగణం: యశ్, శ్రీనిధి, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, అయ్యప్ప పి.శర్మ తదితరులు.
KGF 2′ Movie Review
రచన – దర్శకత్వం: ప్రశాంత్ నీల్
సంగీతం, నేపధ్య సంగీతం : రవి బస్రుర
చాయాగ్రహణం: భువన్ గౌడ
నిర్మాత: విజయ్ కిరగందూరు
తెలుగు రిలీజ్ చేస్తున్న నిర్మాత : సాయి కొర్రపాటి
Also Read: KGF2: ఇంత అద్భుతంగా కేజీఎఫ్2 ఫైనల్ కట్ చేసిన ఎడిటర్ ఈ 19 ఏళ్ల కుర్రాడని తెలుసా?
భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన `కేజీఎఫ్ 2‘ ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. సినిమా చూసిన ప్రేక్షకులు విజిల్స్ తో కేకలతో ఊగిపోతున్నారు. `కేజీఎఫ్ 2’ ప్రపంచ స్థాయి యాక్షన్ మాస్టర్ పీస్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ కామెంట్స్ లో నిజం ఎంత ఉంది ? అసలు సినిమా ఎలా ఉందో ? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
KGF 2′ Movie Review
కేజీఎప్ మొదటి భాగం ముగిసిన చోట నుండి రెండో అధ్యాయం స్టార్ట్ అయింది. రాఖీ (యశ్) కేజిఎఫ్ ను సొంతం చేసుకున్న తర్వాత తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. కోలార్ గనుల్లోనే కాకుండా ఒక నియంతగా తనదైన అధిపత్యాన్ని గుర్తింపును తెచ్చుకున్న రాఖీ పై ప్రధాన మంత్రి రమాసేన్ (రవీనా టాండన్) దగ్గర నుంచి అధిరా (సంజయ్ దత్) వరకూ రాఖీ పై దాడి చేసే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారందర్నీ తన ఎత్తులతో చిత్తు చేసిన రాఖీ జీవితంలో సడెన్ గా జరిగిన ప్రమాదం ఏమిటి ? అతను ఎలా తన కేజిఎఫ్ ను కోల్పోయాడు ? చివరకు రాఖీ ఎలా చనిపోయాడు ? వీటన్నింటి మధ్యలో రీనా (శ్రీనిధి శెట్టి) పాత్ర ఎలా ఉంది ? రీనా, అధీర మరియు ప్రైమ్ మినిస్టర్ కి మధ్య సంబంధం ఏమిటి ? వీళ్ళు రాఖీని ఎలా హ్యాండిల్ చేసాడు ? చివరికి ఏమి జరుగుతుంది ? అనేది మెయిన్ కథ.
విశ్లేషణ :
అద్భుతమైన యాక్షన్ పీరియాడిక్ డ్రామాగా సాగిన `కేజీఎఫ్ 2’లో పవర్ ఫుల్ ఎమోషన్స్ తో పాటు భారీ యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ హృదయాలను హత్తుకుంటుంది. అలాగే పాత్రల మధ్య ఎమోషన్స్ కూడా గుండె బరువెక్కేలా ఉన్నాయి. సినిమాలో లెక్కకు మించి పాత్రలు ఉన్నా.. ప్రశాంత్ నీల్ ప్రతి పాత్రను చాలా బాగా ఎలివేట్ చేశాడు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే భీకరమైన పోరు సీక్వెన్స్ అయితే `కేజీఎఫ్ 2’లోనే బిగ్గెస్ట్ హైలైట్. నటీనటులు కూడా తమ పాత్రల కోసం పోటీ పడి మరీ కష్టపడ్డారు.
KGF 2′ Movie Review
ముందుగా యశ్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ తో యశ్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. దాంతో `కేజీఎఫ్ 2′ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. యశ్ ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. స్టైలిష్ యాక్షన్ లుక్ లోకి యశ్ మారిన విధానం, ఆ లుక్ కోసం యశ్ పడిన కష్టం గురించి మెచ్చుకోవాల్సిందే. ఇక శ్రీనిధి కూడా హీరోయిన్ పాత్రలో ఒదిగి పోయింది. అలాగే ఫస్ట్ హాఫ్ లో యశ్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ వండర్. ఈ క్లైమాక్స్ ను ముందే ఏ ప్రేక్షకుడు ఊహించలేడు. ఇక కథనం విషయానికి కేజీఎఫ్ సిరీసే ఒక యూనిక్ సబ్జెక్టు. చివరగా సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, అయ్యప్ప పి.శర్మలు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు.
ప్లస్ పాయింట్స్ :
యశ్, సంజయ్ దత్ నట విశ్వరూపం,
కథ కథనాలు, డైలాగ్స్,
ఎమోషనల్ సీన్స్,
ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే.
సాంగ్స్,
విజువల్స్ అండ్ ఎమోషన్స్.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో మెయిన్ లవ్ ట్రాక్,
సెకండ్ హాఫ్ లో వచ్చే స్లో సీన్స్,
చిన్న పాయింట్ బేస్ చేసుకుని మొత్తం కథను సాగదీయడం,
అంచనాలను అందుకోలేకపోవడం.
సినిమా చూడాలా ? వద్దా ?
ఫైనల్ గా `కేజీఎఫ్ 2′ ఒక యాక్షన్ మాస్టర్ పీస్. యాక్షన్ సన్నివేశాలతో పాటు విజువల్స్ కూడా అదిరిపోయాయి. కానీ, భారీ అంచనాలు ఉండటంతో.. ఆ అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. మొత్తమ్మీద ఈ చిత్రం యాక్షన్ లవర్స్ ను మాత్రం అబ్బుర పరుస్తోంది.
రేటింగ్ : 2.75 / 5
Also Read:Ghani Collections: ప్చ్.. 9 లక్షలకు పడిపోయిన మెగా హీరో !