Yash And Prabhas: ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరో, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2తో స్టార్ డైరెక్టర్ అయిన దర్శకుడు. ఇద్దరు కలిస్తే ఇక రికార్డులే. చరిత్ర తిరగరాయాల్సిందే. కేజీఎఫ్ -2తో యశ్ ను హీరోగా చేసిన డైరెక్టర్ అయినందునే ప్రభాస్ ఆయనతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. బాహుబలి తరవాత ప్రభాస్ కు రెండు అపజయాలే పలకరించాయి. బాహుబలి రెండు భాగాలు ప్యాన్ ఇండియాలో తమ ప్రభావం చూపించాయి. దీంతో ప్రభాస్ ఇండియా స్టార్ అయిపోయారు. బాహుబలి సినిమాలతో జక్కన్న రాజమౌళి స్థాయి కూడా పెరిగింది.

తనదైన శైలిలో నిర్మించిన బాహుబలి చిత్రాలు బాక్సాఫీసు దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి. దీంతో ప్రభాస్ కు మంచి ఆదరణ వచ్చింది. స్టార్ డమ్ ను తీసుకొచ్చిన బాహుబలి చిత్రాలు ఎన్ని రికార్డులు సృష్టించాయో తెలిసిందే. సాహో, రాధేశ్యాం చిత్రాలు రెబల్ స్టార్ కెరీర్ లోనే ప్లాపులు చవిచూశాయి. దీంతో రాబోయే సినిమా అలా కాకూడదనే ఉద్దేశంతోనే ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలయికలో సలార్ చిత్రం రూపొందుతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. దీనిపై ప్రేక్షకులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇద్దరు సమ ఉజ్జీలు కావడంతో చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసంతో అభిమానులున్నారు.
Also Read: Major Twitter Review: Adivi Sesh’s Film Is A Blockbuster
అందరూ కొత్తవారితో తీసినా ప్రశాంత్ నీల్ ప్రయత్నం బాగుంది. కేజీఎఫ్-2 చిత్ర విజయంలో దర్శకుడిదే కీలక పాత్ర. చిత్ర విజయంలో తనదైన ముద్ర వేశాడు. యశ్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేయడం గమనార్హం. దీంతో డార్లింగ్ కు కూడా మంచి విజయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అందుకే సలార్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ -2 కంటే బ్రహ్మాండమైన విజయం రావాలని ఆకాంక్షిస్తున్నారు.

జూన్ 4 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు కావడంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్-2 హీరో యశ్ ఇద్దరు బెంగుళూరులో ప్రత్యక్షమయ్యారు ప్రశాంత్ నీల్ బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు కలిసి సెల్ఫీలు దిగారు. సందడి చేశారు. అదే వేడుకలో కేజీఎఫ్ -2 50 రోజుల వేడుక కూడా నిర్వహించారు. దీంతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. తమ ప్రియతమ నటుల కలయికతో మురిసిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విటర్ లో పో్స్టులు పెడుతోంది. ముగ్గురు ధీరులు కలవడంతో కార్యక్రమానికే అందం వచ్చిందని తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో పెట్టింది. దీంతో అవి హల్ చల్ చేస్తున్నాయి. ముగ్గురు వీరులు ప్రభాస్, యశ్, ప్రశాంత్ నీల్ కలయిక అపూర్వమని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించింది. మొత్తానికి ప్రశాంత్ నీల్ బర్త్ డే కు ప్రభాస్, యశ్ హాజరై అభిమానులను అలరించారు.
Exclusive 😍❤️🔥❤️🔥@TheNameIsYash BOSS, #Prabhas Sir and the Whole Team of #KGF and @hombalefilms Celebrating Our Captain @prashanth_neel Sir's Birthday 🎉🎉#HBDPrashanthNeel#YashBOSS #Yash19 #Salaar #KGFChapter2OnPrime pic.twitter.com/ekKhnCbHPx
— Yuvaraj Sᵀᵒˣᶦᶜ (@YUVA__YASHCULT) June 3, 2022
Also Read: Pavan Kalyan And Prabhas: విచిత్రమైన సమస్య తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్
Recommended Videos:
[…] […]
[…] […]