Yandamuri Comments On Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవాలంటే హీరోలకు గట్స్ ఉండాలి. ఎలాంటి పాత్రనైనా సరే నటించి మెప్పించగలం అనే కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే ఆ నటుడు నెంబర్ వన్ పొజిషన్ ని చేరుకోగలుగుతాడు… గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఏక ఛత్రాధిపత్యంతో నెంబర్ వన్ పొజిషన్ ను కాపాడుకుంటూ వస్తున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి… ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు అంటే చిరంజీవికి సినిమా అంటే ఎంత పిచ్చో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ఆ మాత్రం పిచ్చి లేకపోతే ఆయన నెంబర్ వన్ పొజిషన్ ను అందుకునే వాడు కాదు కదా! అని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… చిరంజీవి కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తన చేసిన వరుస సినిమాలకు రైటర్ గా వ్యవహరించిన యండమూరి వీరేంద్రనాథ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అనే సినిమా చేశాడు… ఈ సినిమా సగం పూర్తయిన తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ నేను ఈ సినిమా చేయలేనని, నేను అనుకున్నట్టుగా ఈ మూవీ రావడం లేదని నాకు దర్శకత్వం మీద పెద్దగా అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని చెప్పాడు.
దాంతో సినిమాని మధ్యలోనే ఆపేద్దామని చాలా మంది చిరంజీవికి సలహాలను ఇచ్చారు. కానీ ప్రొడ్యూసర్ అప్పటివరకు పెట్టిన డబ్బులు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి ఎలాగోలా ఆ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్ గా మారడంతో చిరంజీవికి చాలా వరకు బ్యాడ్ నేమ్ వచ్చింది.
చిరంజీవి తలుచుకుంటే అప్పుడున్న టాప్ డైరెక్టర్లందరు అతనితో సినిమాలు చేసేవారు. అలా కాదని యండమూరి మీద నమ్మకాన్ని పెట్టుకుంటే ఆయన ఇలాంటి ఒక డిజాస్టర్ ని ఇచ్చాడని చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి యండమూరి వీరేంద్రనాథ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని తను నిలబెట్టుకోలేకపోయానని చెప్పాడు.
మొత్తానికైతే ఇదంతా చూస్తున్న సినిమా ప్రేక్షకులు చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని అతనిని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మోసం చేయలేదని అందులో భాగంగానే యండమూరి కూడా రైటర్ గా సక్సెస్ అయినప్పటికి అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తే, డైరెక్టర్ గా కూడా అతనికి ఒక మంచి లైఫ్ ని దొరుకుతుందని చూశారట. కానీ తను ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేదని చాలామంది చెబుతూ ఉంటారు…