https://oktelugu.com/

Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్ అద్భుతం.. స్టార్ హీరో కోసం మరో కథ సిద్ధం !

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని సాలిడ్ హిట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రంగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కాగా టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం డిసెంబర్ 24న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, ఈ సినిమా కథ చాలా వైవిధ్యంగా ఉండబోతుందని, కథలో చాలా […]

Written By:
  • Shiva
  • , Updated On : December 22, 2021 / 03:14 PM IST
    Follow us on

    Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని సాలిడ్ హిట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రంగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కాగా టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం డిసెంబర్ 24న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    Writer Satyadev Janga

    అయితే, ఈ సినిమా కథ చాలా వైవిధ్యంగా ఉండబోతుందని, కథలో చాలా కొత్త కోణాలు ఉండనున్నాయని ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చాయి. మరి , ఇలాంటి వినూత్నమైన కథను జంగా సత్యదేవ్ అందించారు. జంగా సత్యదేవ్ కథ చెప్పిన వెంటనే నాని ఈ సినిమా ఓకే చేయడం విశేషం. పైగా నాని ఈ సినిమాలో పలు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు.

    ఇక కథతో పాటు ఈ సినిమా కథాంశం కూడా వినూత్నమైన దట. అందుకే, ఈ సినిమా కథతో రచయితగా తనకంటూ తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుందని సత్యదేవ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. శ్యామ్ సింగరాయ్ కథ ఇచ్చిన కిక్ తో సత్యదేవ్ జంగా భవిషత్తులో హర్రర్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

    ఇప్పటికే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఒక అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీని ఓ ప్రముఖ బ్యానర్ అంగీకరించింది. త్వరలో ఆ సినిమా వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. మరి సత్యదేవ్ జంగా ఇలాగే తనకంటూ ఓ కొత్త డిఫరెంట్ నేమ్ తో విభిన్న చిత్రాలు చేయాలని ఆశిద్దాం. ఇక దర్శకుడు రాహుల్ సంకృతియన్ శ్యామ్ సింగరాయ్ కథను అద్భుతంగా చిత్రీకరించాడట.

    Also Read: Pawan Kalyan: పవన్ అక్కగా మారనున్న ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ !

    కాగా రచయిత సత్యదేవ్ జంగా మీడియాతో మాట్లాడుతూ ‘శ్యామ్ సింగరాయ్ సినిమా విషయంలో తనకు సపోర్ట్ చేసిన నానికి, నిర్మాత వెంకట్ బోయినపల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఒక స్టార్ హీరో కోసం సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథను రెడీ చేస్తున్నానని సత్యదేవ్ జంగా తెలిపారు.

    Also Read: Radhe Shyam: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్​ హోస్ట్​గా జాతిరత్నాలు హీరో

    Tags