Chiranjeevi Anil Ravipudi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి…ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ సంక్రాంతికి ఆయన మన శంకర వరప్రసాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ అవ్వడం వల్లే ఈ కథ ఇలా వచ్చిందని లేకపోతే అనిల్ చెప్పిన ఫస్ట్ వెర్షన్ బాగుందని సగటు ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు… సినిమా ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ లో వెంకటేష్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత సినిమా కథ ఎటో వెళ్లిపోయింది.
సెకండాఫ్ లో విలన్ క్యారెక్టర్ ని ఇంకొంచెం ఎక్కువ చేసి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే కొన్ని సన్నివేశాలైతే అనిల్ రాసుకున్నారట. కానీ అలా కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ వెంకీ వస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారని చిరంజీవి చెప్పిన ఐడియాతో వెంకటేష్ కి సంబంధించిన సన్నివేశాలు రాసుకొని అక్కడ కామెడీని డెవలప్ చేశాడు.
ఆ వెంకీ ఎపిసోడ్ లేకుండా అనిల్ రాసుకున్న సన్నివేశాలు తీసినట్లైతే సినిమా రేంజ్ మరోలా ఉండేది అని ఇంకొంతమంది సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక మన శంకర వర ప్రసాద్ సూపర్ సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు మూడు రోజులపాటు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక రాబోయే సినిమాలు సైతం సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటే మన శంకర వరప్రసాద్ సినిమా కలెక్షన్స్ కొంతవరకు తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ ఆ సినిమాలు కూడా డీలా పడితే మాత్రం మన శంకర వరప్రసాద్ సంక్రాంతి విన్నర్ గా నిలిచి భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి…