Sucide attempt: స్టార్ హీరో ఇంటిఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం.. హీరో చేసిన పనికి..

స్టార్ హీరో బయటకొస్తే ఎవరైనా ఏం చేస్తారు? వారితో సెల్ఫీలు దిగడానికి ఎగబడుతారు. ఆ హీరోతో కలిసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈ మహిళ కూడా అదే చేసింది. కానీ చేయాల్సిన టైంలో ఆ పనిచేయలేదు. దీంతో బుక్కైంది. ఉద్యోగం కోల్పోయింది.చివరకు హీరో వల్లే ఇదంతా అయ్యిందని ఆరోపిస్తూ ఆ స్టార్ హీరో ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది.ఇప్పుడిది సినీ వర్గాల్లో సంచలనమైంది. తమిళ స్టార్ హీరో అజిత్ అంటే తెలియని వారుండరు. ఇతడు గతంలో తెలుగులోనూ […]

Written By: NARESH, Updated On : October 6, 2021 11:18 am
Follow us on

స్టార్ హీరో బయటకొస్తే ఎవరైనా ఏం చేస్తారు? వారితో సెల్ఫీలు దిగడానికి ఎగబడుతారు. ఆ హీరోతో కలిసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈ మహిళ కూడా అదే చేసింది. కానీ చేయాల్సిన టైంలో ఆ పనిచేయలేదు. దీంతో బుక్కైంది. ఉద్యోగం కోల్పోయింది.చివరకు హీరో వల్లే ఇదంతా అయ్యిందని ఆరోపిస్తూ ఆ స్టార్ హీరో ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది.ఇప్పుడిది సినీ వర్గాల్లో సంచలనమైంది.

తమిళ స్టార్ హీరో అజిత్ అంటే తెలియని వారుండరు. ఇతడు గతంలో తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. వివాదాలకు దూరంగా ఉండే నటుడు. తన భార్య, పిల్లలు తప్పితే బయట రాజకీయాలు, సినీ సమావేశాల్లో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. అలాంటి అజిత్ ను ఓ మహిళ అనవసరంగా వివాదాల్లో లాగేసింది.

గత ఏడాది కరోనా సమయంలో తమిళ స్టార్ హీరో అజిత్ , ఆయన భార్య షాలినితో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఫర్జానా అనే మహిళ అజిత్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయ్యింది. అజిత్ కు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. అది అజిత్ పరువుకే భంగం వాటిల్లేలా బోలెడు తప్పుడు కథనాలు రాశారు.

దీంతో ఆస్పత్రి తీరుపై విమర్శలు చెలరేగాయి. ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా నర్సు ఫర్జానా వీడియో తీసిందని.. ఆమెను ఉద్యోగంలోంచి యాజమాన్యం తొలగించింది. తన ఉద్యోగం తనకు ఇప్పించేలా చూడాలని ఫర్జానా చాలా సార్లు అజిత్ ను కలవడానికి ప్రయత్నించింది. కానీ ఆ అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలోనే తనకు న్యాయం చేయాలంటూ అజిత్ ఇంటి ఎదుట ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది.

అజిత్ సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆమెపై నీళ్లు పోసి అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అజిత్ సూచన మేరకు ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని సమాచారం.