Chiranjeevi Hook Step: ఒక సినిమా పై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వాలన్నా, నెగిటివ్ బజ్ క్రియేట్ అవ్వాలన్నా ఒకే ఒక్క ప్రమోషనల్ కంటెంట్ చాలు, సినిమా పై ఆడియన్స్ లో ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోవడానికి. ‘మన శంకరవరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రానికి కూడా నిన్న అదే జరిగింది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు కాబట్టి, కచ్చితంగా ఈ చిత్రం పై మినిమం రేంజ్ లో అయినా అంచనాలు ఉండడం సహజం. ఆ మినిమం రేంజ్ అంచనాలే ఇన్ని రోజులు ఆడియన్స్ లో ఉండేవి, కానీ నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పూర్తిగా మారిపోయాయి. ఆ ఈవెంట్ లో విడుదల చేసిన ‘హూక్ స్టెప్’ పాట మూవీ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెంచేసాయి.
అంతే కాకుండా నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్సాహ భరితంగా జరిగింది. ‘హుక్ స్టెప్’ పాట ని స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పుడు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ సమయం లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ తాము కూర్చున్న సీట్స్ మీద నుండి పైకి లేచి, అభిమానుల వైపు చూస్తూ డ్యాన్స్ వేయడం హైలైట్ గా నిల్చింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం వల్ల ఆడియన్స్ ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్ ప్రభావం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో స్పష్టంగా కనిపించింది. నార్త్ అమెరికా లో ఈ చిత్రం ప్రీమియర్ షోస్ కి గడిచిన 24 గంటల్లో లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా పై ఏ రేంజ్ హైప్ ఉంది అనేది.
ఇప్పటి వరకు ఈ చిత్రానికి USA లో 3 లక్షల 50 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రేపటి తో 5 లక్షల మార్కుని అందుకోవచ్చు. చివరి రెండు రోజుల్లో మాత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ జంప్స్ ని ఈ చిత్రం నమోదు చేసుకోబోతుంది . షోస్ పెరిగే కొద్దీ గ్రాస్ పెరుగుతూ పోతుంది. ‘రాజా సాబ్’ లాగానే, ఈ చిత్రం కూడా కచ్చితంగా 1 మిలియన్ డాలర్ ప్రీ సేల్స్ మార్కు ని అందుకుంటుందని మెగా ఫ్యాన్స్ బలమైన నమ్మకం తో చెప్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి నమోదు అవుతున్న ఆక్యుపెన్సీ ఆ రేంజ్ లో ఉంది మరీ. అన్నీ అనుకున్నట్టు జరిగితే, కచ్చితంగా ఈ చిత్రం ఓవర్సీస్ ప్రీమియర్స్ గ్రాస్ విషయం లో ప్రభంజనం సృష్టించడం ఖాయం అని అంటున్నారు.