Lokesh Open Challenge: రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. ప్రతిపక్షాలు ఎన్ని రకాల విమర్శలు చేసినా వెనక్కి తగ్గడం లేదు. అదే సమయంలో ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు ఔత్సాహికులు. ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. అయితే పరిశ్రమలకు పెద్ద ఎత్తున భూములు ఇస్తుండడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది వైసిపి. అయితే టిడిపి ప్రభుత్వం ఒక స్టాండ్ తో ముందుకు వెళ్తోంది. ఇటువంటి విమర్శలను లెక్కచేయం అంటూ తేల్చి చెబుతోంది. తాజాగా మంత్రి నారా లోకేష్ మీడియా ముఖంగానే దీనిపై స్పష్టత ఇచ్చారు. తాము ఎందుకు భూములు ఇస్తున్నాం అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఏకంగా మీడియా ప్రతినిధులకు ధీటైన సమాధానం చెప్పారు. పరిశ్రమల విషయంలో తమ పాలసీని తేల్చి చెప్పారు మంత్రి నారా లోకేష్.
భారీగా పరిశ్రమలు..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా విశాఖకు భారీగా ఐటి పరిశ్రమలు తరలివచ్చాయి. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ప్రారంభించేందుకు సమ్మతించింది. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా చేసుకుంది. జాతీయస్థాయిలో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందు వరసలో నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పరిశ్రమల ఏర్పాటు వెనుక ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా భూములు నామమాత్రపు ధరకు అందించడమే.
క్లారిటీ ఇచ్చిన లోకేష్..
విశాఖ తో( Visakhapatnam) పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా పరిశ్రమల ఏర్పాటు జరిగితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం భారీగా వస్తుంది. ఈ ఆలోచనతోనే ప్రభుత్వం సైతం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. అందులో భాగంగా కొన్ని సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి కేటాయించిన సంగతి తెలిసిందే. నిన్ననే విశాఖ వచ్చిన లోకేష్ ను ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. 99 పైసలకే భూములు కేటాయించడం ఏంటనే ప్రశ్న వారి నుంచి వినిపించింది. కానీ దీనిపై లోకేష్ చాలా క్లారిటీతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్లే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలంటే ఖచ్చితంగా తక్కువ ధరకు భూములు అందించాల్సిన అవసరం ఉందని కూడా లోకేష్ తేల్చి చెప్పారు. ఎకరా భూమి మాత్రమే కాదు.. అవసరం అనుకుంటే వారికి అవసరమైన భూమిని తక్కువ ధరకే అందిస్తామని కూడా తేల్చి చెప్పారు. ఇది ప్రైవేటు వ్యవహారం కాదని.. ఇంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రక్రియ అన్న విషయాన్ని మరిచిపోకూడదు అన్నారు లోకేష్. తద్వారా ఇటువంటి విమర్శలకు, గోబెల్స్ ప్రచారాలకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు లోకేష్.
రిపోర్టర్ : మీరు కంపెనీలు తీసుకొస్తున్నారు, కానీ ఎకరానికి 99 పైసలకే ఇస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
మంత్రి @naralokesh : తప్పేంటి? ఎకరానికి కాదు, మొత్తం భూమిని 99 పైసలకు ఇస్తాను, తప్పేంటి? pic.twitter.com/RKnTiZASPI
— greatandhra (@greatandhranews) January 7, 2026