Homeఎంటర్టైన్మెంట్Vijay become a Tamil Nadu CM: పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్న విజయ్......

Vijay become a Tamil Nadu CM: పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్న విజయ్… తమిళనాడు సీఎం అవుతాడా..?

సినిమాల విషయంలో హీరోల మధ్య పోటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఒక హీరో ఏ సినిమా చేస్తున్నాడు అనేది తెలుసుకొని మిగతా హీరోలు సైతం అలాంటి సినిమాలను చేసి వాళ్ళ కంటే మనం సూపర్ సక్సెస్ ను సాధించి వాళ్ళకంటూ ఒక అడుగు ముందు వరుసలో ఉండాలనే ప్రయత్నం చేస్తుంటారు. తమిళ్ హీరో అయిన విజయ్ మాత్రం తెలుగులో ఉన్న పవన్ కళ్యాణ్ ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాడు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ని ఇమిటేట్ చేస్తూనే సక్సెస్ లను సాధిస్తున్నారు. రజనికి తెలియకుండానే పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే జనసేన పార్టీని పెట్టి పవన్ కళ్యాణ్ పొలిటిషన్ గా మారిన విషయం మనకు తెలిసిందే. 2024వ సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లలో జనసేన పార్టీ తరపున పోటీచేసి 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఘనత కూడా తనకే దక్కింది. 100% సక్సెస్ రేట్ ను కలిగి ఉన్న ఏకైక పార్టీగా జనసేన పార్టీ చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళనాడు రాజకీయాల్లో కూడా పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో విజయ్ సైతం ఒక పొలిటికల్ పార్టీని పెట్టి రాజకీయ రంగంలో అడుగు పెట్టాడు.

ఇక తమిళనాడులో విజయ్ హవా ఎలా ఉండబోతుంది. విజయ్ తన సత్తా చాటుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సైతం పార్టీని పెట్టిన పది సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం గా అధికార బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. విజయ్ కూడా అలాంటి ధోరణిలోనే ఉంటే మంచిది.

ఎందుకంటే పార్టీ పెట్టగానే అధికారం వస్తుంది అనుకుంటే అది తన మూర్ఖత్వం అవుతుందని చాలామంది చెబుతున్నారు. మరి పొలిటికల్ గా తన పవర్ ఎలా ఉంటుంది. తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవగలుగుతాడు. అక్కడ ఆల్రెడీ పాతుకుపోయిన స్టాలిన్ గవర్నమెంట్ ని పడగొట్టే దమ్ము విజయ్ కి ఉందా? అనే అంశాల మీద చర్చలైతే జరుగుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా విజయ్ తన చివరి సినిమాగా నటించే ‘జన నాయకుడు’ సినిమా సైతం రిలీజ్ కి ఇంకా నోచుకోలేదు. ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇప్పటివరకు ఇంకా రిలీజ్ కాకపోవడం వెనక రాజకీయ కుట్రలు కూడా ఉన్నాయంటూ అతని అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version