Shiv Kailashon Ke Waasi: అందం టాలెంట్ ఉన్నప్పటికీ, పెద్ద స్టార్ స్టేటస్ రేంజ్ కి చేరుకోలేకపోయిన హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ‘రాశీ ఖన్నా'(Rashi Khanna). ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రం తో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసిన రాశీ ఖన్నా, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూలు కట్టాయి. కానీ అన్నీ మీడియం రేంజ్ సినిమాలే. నటన పరంగా విభిన్నమైన కోణాలు కూడా ఈమె అతి తక్కువ కాలం లోనే ఆడియన్స్ కి చూపించింది. కానీ పెద్ద స్టార్స్ సినిమాల్లో అవకాశాలు మాత్రం తక్కువగానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఈమె నటించిన ‘జై లవకుశ’ చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో, ఇక వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఈమెని చూడొచ్చని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు.
అయితే రీసెంట్ గానే ఆమెకు పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో నటించే అవకాశం వచ్చింది. చాలా కాలం తర్వాత స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది, ఇక రాశీ ఖన్నా కెరీర్ మలుపు తిరగబోతుంది అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ సినిమాలో ఆమెకు నటించడానికి స్కోప్ ఉండదు, సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతుంది. ఒకవేళ హిట్ అయినా ఆమె కెరీర్ కి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇదంతా పక్కన పెడితే రాశీ ఖన్నా లో ఎవరికి తెలియని ఒక టాలెంట్ ఉంది. అదే సింగింగ్ టాలెంట్. గతం లో ఈమె ‘జోరు’, ‘బాలకృష్ణుడు’, ‘జవాన్’, ‘ప్రతి రోజు పండగే’ వంటి సినిమాల్లో పాటలు పాడింది. ఇక నిన్న శివరాత్రి సందర్భంగా రాశీ ఖన్నా శివుడి పై ఒక పాట పాడుతూ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
మొత్తం హిందీ బాషలోనే ఈ పాట ఉన్నప్పటికీ, రాశీ ఖన్నా పాడిన తీరు, ఆమె స్వరానికి ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. ‘శివ్ కైలాషన్ కే వాసి’ అంటూ సాగే ఈ పాట మూడు నిమిషాల నిడివి తో ఉంటుంది. సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ పాటని మీరు కూడా వినేయండి. ఇది విన్న తర్వాత రాశీ ఖన్నా లో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోక తప్పదు. ఆ రేంజ్ లో ఆమె పాట ని ఆలపించింది. ప్రొఫెషినల్ సింగర్స్ ఎలా పాడుతారో, అలా పాడింది రాశి ఖన్నా. ఇది విన్న తర్వాత మీరు ప్లే బ్యాక్ సింగర్ గా కూడా కొనసాగొచ్చు కదా, ఎందుకు కొన్ని సినిమాలకే మీ గాత్రాన్ని పరిమితం చేశారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
