Director Venu Yellamma Movie: ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు మాత్రమే గొప్ప గుర్తింపైతే వచ్చింది. ఇక బలగం సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకున్న దర్శకుడు వేణు ఎల్దండి…ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ ని హీరోగా పెట్టి ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ గ్లింప్స్ ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.
ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధిస్తే అటు దేవీ శ్రీ ప్రసాద్ స్టార్ హీరోగా మారడమే కాకుండా వేణు సైతం టాప్ డైరెక్టర్గా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక రా అండ్ రాష్ట్రిక్ కథ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దేవుడి గొప్పతనం గురించి ఎలా చూపించబోతున్నాడు.
అసలు మనుషులకు దేవుళ్ళకు మధ్య ఎలాంటి బంధం ఉంటుంది అనేది మనకు క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు వేణు అంటే కమెడియన్ గానే ప్రతి ఒక్కరు గుర్తించారు. కానీ తన మొదటి సినిమా సూపర్ సక్సెస్ అయిన కూడా అతన్ని ఆదరించే వారు లేకపోవడంతో అతని సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు భయపడిపోయారు.
ఎల్లమ్మ సినిమా కోసం మొదట నితిన్ ను ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి నటులను అనుకున్నప్పటికి వాళ్లు సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో దేవి శ్రీ ప్రసాద్ తో ఈ సినిమా చేయడానికి వేణు సిద్ధమయ్యాడు. ఈ సినిమాని దేవిశ్రీ ప్రసాద్ తో చేస్తున్నాడు. ఈ మూవీతో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…