Vamshi Paidipally: సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు ఎంత మంది ఉన్నప్పటికి సక్సెస్ లు సాధించిన వాళ్లకు మాత్రమే ఇక్కడ అవకాశాల వస్తాయి. అలాంటి దర్శకులతో స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మున్నా సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వంశీ పైడిపల్లి మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి మార్కులైతే కొట్టేసాడు. ఇక రెండో సినిమా అయిన బృందావనంతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఆయన గత మూడు సంవత్సరాల నుంచి ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. తమిళ్ విజయ్ ని హీరోగా పెట్టి చేసిన ‘వారసుడు’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన చాలా వరకు డీలా పడిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అతనికి హీరోలైతే ఛాన్స్ ఇవ్వడం లేదు.
బాలీవుడ్ హీరోలతో సినిమాలను చేయడానికి సన్నాహాలు చేసిన కూడా వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చే పరిస్థితి లేదు. మొదట అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఆయన నో చెప్పడంతో సల్మాన్ ఖాన్ దగ్గరికి తన కథను తీసుకెళ్లాడు. మొత్తానికైతే సల్మాన్ ఖాన్ ఈ సినిమాని చేస్తాడా?
తద్వారా వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ కి భారీ సక్సెస్ ని కట్టబెడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడు చేసే ప్రతి సినిమా విజయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అయినప్పటికి ఆయన సినిమాలు ప్లాప్ అవ్వడం పట్ల పలువురు సినిమా మేధావులు సైతం పలు రకాల విమర్శలైతే చేస్తున్నారు.
అతని సినిమాకి దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకుంటున్నాడు. అయినా కూడా సినిమాని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఏమాత్రం డీలా పడిన కూడా అతన్ని పట్టించుకునే హీరోలైతే ఉండరు…