Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే సినిమాలు ప్రతి ఒక్కటి కూడా హిట్ ను సాధిస్తాయి. అందుకే ఈయన సినిమా వస్తుందంటే వెయిట్ చేస్తుంటారు నెటిజన్లు. ఇక రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో వస్తున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో సూపర్ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ప్రజలను ఎంతో ఊరిస్తుంటుంది. నిన్న ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను కూడా తనదైన స్టైల్ లో నెటిజన్లలోకి తీసుకెళ్తున్నారు త్రివిక్రమ్.
అయితే ఈ మధ్య గుంటూరు కారం విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదట డైరెక్టర్. ఈయన నిర్లక్ష్యం వహించడానికి కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు కొందరు. వాస్తవానికి ఈ డైరెక్టర్ అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్. ఈయన పేరు మీదనే చాలా సినిమాలు కూడా నడుస్తాయి. అంత పేరున్న త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదనే అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దీనికి కారణం ఈ సినిమాలో మహేష్ బాబు ఎక్కువ ఇన్వాల్వ్ అవడమే అనే అంటున్నారు కొందరు. ఇందులో నిజం ఎంత అనేది ఇద్దరిలో ఒకరు స్పందిస్తే గానీ తెలియదు.
ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమాలో కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాను ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆదరిస్తారో చూడాలి. ఇప్పటి వరకు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కొందరు ఆశాభావం వక్తం చేస్తున్నారు. అంతేకాదు త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాను ఇస్తానన్నారు కాబట్టి కచ్చితంగా సినిమా హిట్ అవుతుందంటున్నారు. మరి చూడాలి రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో…