Vijay Deverakonda- Nani: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. సెప్టెంబర్ 1 విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్స్ తెచ్చుకొని పరవాలేదు అనిపించుకుంది. దాదాపు గీతాగోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ కి కొంచెం హిట్టుగా నిలిచిన సినిమా కృషినే కావడంతో ఈ హీరో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆ ఆనందంలోనే, తాజాగా కోటి రూపాయల మొత్తాన్ని వంద కుటుంబాలకు లక్ష చొప్పున అందిస్తానని ప్రకటించేశాడు ఈ హీరో. అభిమానుల సమక్షంలో ఈ ప్రకటన ఇచ్చారు. ఈ హీరో చేసిన పనికి అందరూ ప్రశంసలు ఇవ్వగా విజయ దేవరకొండ కెరియర్లో అట్టర్ ఫ్లాప్ గా మిగిలిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిర్మాతలు మాత్రం విమర్శలు చేశారు.
అభిషేక్ పిక్చర్స్ సంస్థ విజయ్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో …‘‘డియర్ విజయ్ దేవరకొండ. వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాన్ని పంపిణీ చేసి రూ.8 కోట్లు నష్టపోయాం. దానిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు నీ పెద్ద మనసుతో అభిమానుల కుటుంబాలకు రూ. కోటి విరాళంగా ఇస్తున్నావ్. దయచేసి మమ్మల్ని, మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలకు కాపాడాలని కోరుతున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ విజయ దేవరకొండ అని ఇదే విషయం మామూలు టైంలో అడిగి ఉండొచ్చు. ఇలా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అడగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందువల్ల ఆగ్రహానికి గురైన చాలామంది మీరు ఇలానే పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలను అయితే అడగగలుగుతారా అని అభిషేక్ పిక్చర్స్ వేసినా ట్వీట్ కింద కామెంట్లు పెడుతున్నారు.
ఇది నిజమే కదా అని అనిపించక మానదు. ఎందుకంటే బడా ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు ఎన్నో డిజాస్టర్లు ఇచ్చారు. కానీ అలాంటి హీరోలను ఈ నిర్మాతలు ఏమీ అడగడం లేదు. కాగా విజయ్ దేవరకొండ.. నాని లాంటి వారిని మాత్రం సోషల్ మీడియాలో చాలామంది ఏ పోస్ట్ వేసినా పలు రకాలుగా విమర్శిస్తూ వస్తున్నారు.
విజయ దేవరకొండ సినిమాల వల్ల సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వింటూ ఉంటే నాని తను ఏదన్నా ఒక మంచి పోస్టు వేసినా కానీ విమర్శలే వింటున్నారు. మరి నిర్మాతలు కానీ.. కొంతమంది అభిమాన సంఘాలు కానీ ఎందుకు పెద్ద హీరోలని అలానే పెద్ద హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలని టార్గెట్ చేసి ఇలా అడగడం లేదు అనేది సాధారణ ప్రేక్షకుడికి ఉన్న సందేహం.