https://oktelugu.com/

Heroes : స్టార్ హీరోలు గడ్డం పెంచితే సినిమా సూపర్ హిట్ అవుతుందా..?

Heroes : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన హీరోలకు మాత్రమే ఇక్కడ మంచి క్రేజ్ అయితే ఉంటుంది.

Written By: , Updated On : March 27, 2025 / 11:25 AM IST
Heroes

Heroes

Follow us on

Heroes : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన హీరోలకు మాత్రమే ఇక్కడ మంచి క్రేజ్ అయితే ఉంటుంది. అలాగే వాళ్ళ సినిమాలకే ఎక్కువ మార్కెట్ ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ స్టార్ హీరోలుగా ఎదిగే అవకాశాలైతే ఉంటాయి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక దానికోసమే స్టార్ హీరోలందరూ మాస్ రగ్గుడ్ లుక్ లో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులందరిని ఎంటర్ టైన్ చేశాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన హైప్ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ ని కూడా నమోదు చేశాడు. ఇక ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలోనే వచ్చిన పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ భారీ గడ్డం పెంచి రగ్గుడ్ లుక్ లో కనిపించి భారీ విజతాన్ని అందుకోవడమే కాకుండా పుష్ప 2 సినిమాతో ఏకంగా 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాడు. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాలో కూడా రగ్గుడ్ లుక్ లో కనిపించడమే కాకుండా ఒక భీకరమైన పోరాటం చేయబోతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తున్నాడు.

Also Read : ఈ 25 సంవత్సరాల్లో మన స్టార్ హీరోలు సాధించిన ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవే…

ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో గడ్డం పెంచితే చాలు సినిమా సూపర్ హిట్ అయిపోతుంది అనే ఒక నమ్మకంలో స్టార్ హీరోలందరు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్క హీరో కూడా గడ్డం పెంచుతూ భారీ లుక్ ను మైంటైన్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు రామ్ చరణ్ హీరో గా వస్తున్న ‘పెద్ది’ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది. తద్వారా రామ్ చరణ్ మరో మెట్టు పైకి ఎదగబోతున్నాడా? నటుడిగా తనకంటూ ఒక బెస్ట్ పర్ఫామెన్స్ ని ఇస్తాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరి మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ తన మార్క్ నటనని చూపించడానికి సిద్ధమవుతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఇక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎలాంటి వైవిధ్యమైన కథాంశాలు ఉండబోతున్నాయి. తద్వారా రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడు. పాన్ ఇండియాలో భారీ సక్సెస్ గా నిలుపుతారా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Also Read : పాన్ ఇండియా ఇండస్ట్రీ లో ఖాన్ త్రయం లా గుర్తింపు సంపాదించుకోబోతున్న ముగ్గురు తెలుగు హీరోలు వీళ్లేనా..?

 

heroes