Ustaad Bhagat Singh climax: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటికే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఇక ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి.
వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? ప్రేక్షకులందరిని సర్ప్రైజ్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.గత సంవత్సరం సుజిత్ దర్శకత్వంలో చేసిన ఓజీ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ఈ సినిమాను మంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందనే నమ్మకంతో అటు పవన్ కళ్యాణ్ ఇటు హరీష్ శంకర్ కూడా ఉన్నాడు.ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది.
పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరితో మ్యాజిక్ చేసినట్టుగా ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ లో ఒక డిఫరెంట్ ప్రయత్నం చేస్తున్నారట. ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ ఇప్పటివరకు ఏ సినిమాలో చూడని విధంగా కొత్తగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇక అంతకుమించి క్లైమాక్స్ లో ఏం చేశారా అంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో హరీష్ శంకర్ కమర్షియల్ డైరెక్టర్ గా మరోసారి తన సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తే హరీష్ శంకర్ మరోసారి తన సత్తా చాటుకున్నాడవుతాడు…