Boyapati Srinu: అఖండ ఘన విజయంతో యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి భారీ ఊపు వచ్చింది. పైగా తెలుగు చిత్రసీమలోనే తాను పక్కా యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజాన్ని అని బోయపాటి మరోసారి ఘనంగా చాటుకున్నాడు. నిజానికి అఖండ రిలీజ్ కి ముందు బోయపాటికి డేట్లు ఇవ్వడానికి హీరోలు ఆలోచించారు. ఓ దశలో బన్నీ కూడా డేట్లు ఇస్తా అని ముందు మాట ఇచ్చి, ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు.

కానీ అఖండ రిలీజ్ అయి అఖండ విజయం సాధించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా ఖాయం అయిపోయింది. అయితే, ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కోసం పక్కా ఎమోషనల్ గా సాగే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట.
Also Read: సమంత వార్తల పై ఫీల్ అయిన పూజా హెగ్డే !
అయితే, ఈ స్క్రిప్ట్ లో హీరో పాత్ర డ్యుయెల్ రోల్ అని తెలుస్తోంది. బన్నీ డ్యుయెల్ రోల్ లో కనిపిస్తాడట. ఎప్పటిలాగే ప్లాష్ బ్యాక్ లో ఒక హీరో, లైవ్ లో మరో హీరో.. మొత్తమ్మీద బోయపాటి, బాలయ్య ఫార్ములాని బన్నీ పై రుద్దుతున్నాడు. మరి సక్సెస్ వస్తోందో.. లేక, రొటీన్ కొట్టుడు అని అపవాదులు వస్తాయో చూడాలి. పైగా ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందట.
ఎలాగూ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా కాబట్టి.. సినిమా భారీ స్థాయిలోనే ఉంటుంది. పుష్ప ఎలాగూ బన్నీకి పాన్ ఇండియా గుర్తింపు తీసుకు వచ్చింది. ఆ గుర్తింపు బోయపాటి సినిమాకి బాగా ప్లస్ అవుతుంది.
పైగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటిస్తాడని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ గుసగుసలు నిజం అయితే, సినిమా పై హిందీలో భారీ అంచనాలు పెరిగినట్టే.
Also Read: రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ !