Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: పుష్ప2 లో ఆ పాత్రను చంపేయబోతున్నారా? ఫ్యాన్స్ అంగీకరిస్తారా?

Pushpa 2: పుష్ప2 లో ఆ పాత్రను చంపేయబోతున్నారా? ఫ్యాన్స్ అంగీకరిస్తారా?

Pushpa 2: అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తిరుగులేని విజయాన్ని అందుకుని తన సత్తా చాటాడు. వైవిధ్యమైన పాత్రలు చేయడంలో తనకు తానే పోటీ అని నిరూపించుకున్నాడు. దీంతో ఆయన టాలెంట్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సహజమైన నటనతో అందరిని మెప్పించాడు. ఫలితంగా పుష్ప ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. అందరి అంచనాలు అందుకుని సాధించిన విజయంతో పుష్ప2 కు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదే లెవల్లో అదరగొట్టి బాక్సాఫీసు కలెక్షన్లు కొల్లగొట్టాలని భావిస్తున్నారు. ఇందు కోసం కసరత్తు కూడా జరుగుతోంది.

Pushpa 2
allu arjun, rashmika mandanna

పుష్ప-2పై అందరిలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. పాత్రల ఎంపికలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని పాత్రలు ఉన్నా కొన్నింటిపై సుకుమార్ ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పుష్ప2పై ఎన్నో రకాల పుకార్లు వైరల్ అవుతున్నాయి. సుకుమార్ ఇంకా కథను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సినిమా సెట్ మీదకు వెళ్లడానికి ఇంకా సమయం పడుతోంది. ఈ లోపు ప్రేక్షకులు సినిమాపై ఎవరి అంచనాలకు తగినట్లు వారు కథ గురించి చర్చిస్తున్నారు.

Also Read: TDP Politics on Mega Family : మెగా ఫ్యామిలీపై టీడీపీ కుట్ర!

పుష్ప2లో ఓ ప్రధాన పాత్రపై అందరు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ఒక పాత్రను మాత్రం చంపించబోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది అది ఎవరిదనే దానిపై స్పష్టత లేదు. అల్లు అర్జున్ స్నేహితుడి పాత్ర అని కొందరు అంటుంటే కొందరేమో శ్రీవల్లి పాత్రను చంపేయబోతున్నారని చెబుతున్నారు. హీరోయిన్ ను మొదట్లోనే చంపేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? హీరోయిన్ లేని సినిమాను ఊహించుకుంటారా? అది సాధ్యమేనా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

Pushpa 2
rashmika mandanna

ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఎవరికి తోచిన విధంగా వారు కథలో మలుపులు తిప్పుతున్నారు. ఆలి లేదు శూలు లేదు కొడుకు పేరు రామలింగం అన్నట్లు ఇంకా కథే పూర్తిగా సిద్ధం కాకపోయినా ప్రేక్షకుల ఊహాగానాలకు రెక్కలొస్తున్నాయి. పుష్ప2తో కూడా సంచలన విజయం అందుకోవాలని సుకుమార్ పట్టుదలతో ఉన్నాడు. మొత్తానికి అల్లు అర్జున్ సుకుమార్ ల కలయిక ఓ సెన్సేషన్ కానుందని తెలుస్తోంది. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. సినిమాను ఏ కోణంలో చూపిస్తే బాగుంటుందనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. బన్నీ మరో బ్లాక్ బస్టర్ సాధిస్తాడని అందరు చర్చించుకుంటున్నారు. పుష్ప2తో కలెక్షన్ల వర్షం కురిపించాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.

Also Read:Naga Chaitanya: తెలుగు హీరోయిన్ ప్రేమలో నాగ చైతన్య? … ఆమెతో చెట్టాపట్టాల్!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular