దేశంలో మార్చి నెలలో కరోనా కారణంగా మూతపడిన సినిమా హాల్స్ లో కొన్ని గోడౌన్ లు గాను, కళ్యాణమండపాలగానూ మారిపోయాయి. ఎక్సిబిటర్ లు ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతున్నారు. అయితే, కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు పునః ప్రారంభం చేసుకోవటానికి అనుమతులు ఇచ్చాయి. కాని 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే నడిపేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీనితో చిత్ర పరిశ్రమకు కొంతమేర ఉపశమనం లభించినట్లుయింది. కానీ పెద్ద బడ్జెట్ సినిమాలకు అది వర్కౌట్ అవ్వదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అయినా జనాలు మాత్రం ,సినిమాలు చూడటానికి రావడం లేదు.
Also Read: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్ !
ఈ కారణంతో సినిమాలు కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి సమయంలో ధైర్యంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్దమయ్యాడు. ఈ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25 న రిలీజ్ చేయబోతున్నారు. తేజ్ తర్వాత సంక్రాంతి కానుకగా రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల రిలీజ్ కు సాధారణ ప్రజలు కన్నా ఇండస్ట్రీ వర్గాలే ఎక్కువ ఆసక్తితో ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్ కార్యాచరణకు రెండు సినిమాలే దారి చూపించబోతున్నాయి.
Also Read: అభిమానులకి షాక్ ఇచ్చిన ‘పాయల్ రాజ్‌పుత్’ !
50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండటంతో ఒక వేళ ఫలితం పాజిటివ్ గా వచ్చి కమర్షియల్ గా నిరాశ పర్చితే మాత్రం ఇతర సినిమాల విడుదలకు సినీ వర్గాలు జంకుతారు. ఒక వేళ ఫలితం అనుకూలంగా ఉండి కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లు రాబడితేనే ఖచ్చితంగా వరుసగా సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సాయి ధరమ్ తేజ్ మరియు రవితేజ చేస్తున్న ఈ సాహసం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మరి. చిత్ర పరిశ్రమకి పాత రోజులు తిరిగి వస్తాయో లేదో కాలమే నిర్ణయిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్