తెలంగాణ సర్కారు సైతం స్పందించి ప్రజల్ని భయపెట్టే విధంగా మాట్లాడొద్దని సూచించింది. దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా జోక్యం చేసుకుని మల్లిక్ కు మద్దతు పలకడం విశేషం. ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టెది ఇంకో దారి అన్నట్లుగా రాంగోపాల్ వర్మ కెమికల్ ఇంజినీర్ కే సపోర్టు చేస్తూ రంగంలోకి దిగారు. ఆయనపై కేసులు పెట్టడాన్ని ఖండించారు.
తెలంగాణ డైరక్టరేట్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావును టార్గెట్ చేశారు. దీనికి నిరసనగా 16 ట్వీట్లు చేశారు. మూడో దశ గురించి మల్లిక్ మాట్లాడిన ఎలా కేసులు పెడతారంటూ వర్మ విమర్శించారు. తనపైనా ఎఫ్ఐఆర్ సిద్ధంగా ఉంటానన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
వివాదాల్లో ఉండడం రాంగోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. ఎప్పుడు మీడియాలో హల్ చల్ చేసే ఆర్జీవీ ప్రస్తుతం మల్లిక్ వ్యవహారంలో హాట్ టాపిక్ అయ్యారు. మల్లిక్ అనబడే కెమికల్ ఇంజినీర్ పై కేసులు పెట్టడం తప్పా ఒప్పా అన్న చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆర్జీవీ వచ్చి మసాలా దట్టిస్తున్నారు.