‘బాహుబలి’ సిరీసుల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘బాహుబలి’ సృష్టించిన ప్రభంజనంతో ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎన్ని కోట్లు వెచ్చించైనా ఆయనతో సినిమా చేసేందుకు వెనుకడం లేదు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మల్టిస్టారర్ కమ్ ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: చంటి అడ్డాలపై ఫైర్ అయిన నిర్మాత నట్టికుమార్
ఈ మూవీ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ మూవీ చేయనున్నట్లు ప్రకటించాడు. 2021 వేసవిలో ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాక మహేష్ మూవీ పట్టాలెక్కడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు ఎప్పుడనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. దర్శకధీరుడు రాజమౌళికి మహాభారతం మూవీని తెరకెక్కించాలనే కోరిక ఉంది. మహాభారతం ఇతిహాసాన్ని ఇప్పటికే చాలామంది దర్శకులు సినిమాగా తెరకెక్కించి విజయాలను అందుకున్నారు.
మహాభారతంను ఎవరు ఎలా తెరకెక్కించిన అది వెండితెరపై అద్భుతంగానే కన్పిస్తోంది. అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం మహాభారతాన్ని సరికొత్త తీర్చదిద్దుతారనే టాక్ విన్పిస్తోంది. మహాభారతాన్ని రాజమౌళి ఐదుభాగాలుగా చిత్రీకరించనున్నాడట. ఇదే ఆయనకు చివరి చిత్రం కానుందనే ప్రచారం జరుగుతోంది. రాజమౌళికి సినిమాల నుంచి ఏ వయస్సులో రిటైర్ కావాలో ముందే ప్రణాళిక ఉందని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ తర్వాత ఆయన సినీ కెరీర్ కు సగర్వంగా గుడ్ బై చెబుతారనే టాక్ విన్పిస్తోంది.
Also Read: గంగవ్వ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఔట్..!
అయితే చిత్రం తెరకెక్కడానికి ఇంకో ఐదేళ్లు పట్టనుందట. ఈ సినిమాలో నటించేందుకు బాలీవుడ్.. టాలీవుడ్.. ఇతర భాషల్లోని నటీనటులంతా ఇంట్రెస్టు చూపుతున్నారట. దీంతో అన్నిభాషల నటీనటులు రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టులో నటించేందుకు అమీర్ ఖాన్ లాంటి వాళ్లు ఆసక్తి చూపుతున్నారని టాక్. అదిరిపోయే కాంబినేషన్.. గ్రాఫిక్స్ తో ఈ సినిమా మరోచరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.