Spirit Movie Climax Twist
Spirit Movie : సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ అంటే బోల్డ్ సినిమాలను చేస్తాడు అంటూ ఆయనకు ఒక గుర్తింపైతే ఉంది. మరి ప్రభాస్(Prabhas) తో చేయబోయే సినిమా కూడా అలాంటి సినిమానేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే ప్రభాస్ తో ఆయన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటింపజేస్తున్నారు. ఇక దాంతోపాటుగా ఈ సినిమా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తే అది ఇండస్ట్రీ హిట్ సినిమాగా మారాలి. అంతే తప్ప నార్మల్ సక్సెస్ అయితే అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమా మీద తీవ్రమైన కసరత్తులు చేసి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలువడానికి ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉండబోతుందట.
ఇక ఇప్పటివరకు మనం పోకిరి సినిమాలోని ట్విస్ట్ ను హైలెట్ గా చేసి చెప్తున్నారు కదా ఇకమీదట నుంచి స్పిరిట్ సినిమా ట్విస్ట్ హైలెట్ గా నిలవబోతోంది అంటూ మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ని యాక్షన్ ఎపిసోడ్స్ లో భారీ రేంజ్ లో చూపించాలనే ప్రయత్నం చేస్తున్న సందీప్ రెడ్డి వంగ తను తదుపరి సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన స్టార్ హీరోలు అందరూ వాళ్ళను వాళ్లు ఎలివేట్ చేసుకోవడంలో మాత్రం చాలా వరకు వెనుకబడి పోతున్నారనే చెప్పాలి. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక మంచి దర్శకుడు దొరికితే ప్రభాస్ ఈజీగా ఇండస్ట్రీ హిట్ కొట్టి దాదాపు 2500 కోట్ల వరకు కలెక్షన్లు రాబడతారంటూ అటు సందీప్ రెడ్డి వంగ అభిమానులు ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ సైతం వల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఇకమీదట ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. తద్వార ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరుగుతుంది అనేది…