Homeఎంటర్టైన్మెంట్Peddi movie audience response: పెద్ది అక్కడి ప్రేక్షకులను అలరిస్తుందా..? బుచ్చిబాబు కెరియర్ సెట్ అయినట్టేనా..?

Peddi movie audience response: పెద్ది అక్కడి ప్రేక్షకులను అలరిస్తుందా..? బుచ్చిబాబు కెరియర్ సెట్ అయినట్టేనా..?

Peddi movie audience response: కొన్ని సినిమాలు కొంతమంది ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. మరికొన్ని సినిమాలు కొన్ని ప్రాంతాల్లో పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. కానీ ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొటీన్ కథలకు కాలం చెల్లిపోయిందని చెబుతున్నారు. కానీ ఈ క్రమంలోనే ‘పెద్ది’ సినిమా రొటీన్ స్టోరీ తోనే వస్తుందనేది మాత్రం మనకు ట్రైలర్ ను చూస్తూనే అర్థమైపోతుంది. ఇక అలాంటి కథను తెలుగు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు అనే విషయం పక్కన పెడితే బాలీవుడ్ వాళ్ళు ఆ సినిమాని ఎలా తీసుకుంటారు. అక్కడి ప్రేక్షకుల్లో చాలా మంది త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కి వీరాభిమానులుగా మారిపోయారు. రామ్ చరణ్ ను ఒక రొటీన్ స్టోరీలో ఎలా చూడగలుగుతారు అనేదే ఇప్పుడు చర్చనియంశంగా మారింది. మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా కష్టపడి వర్క్ చేసినప్పటికి ఆయన కష్టం అనేది మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించబోతున్నాడు. ఒకటి క్రికెటర్ గా, రెండు కుస్తీ ఫైటర్ గా, మూడు రన్నర్ గా మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ నుంచి ఇలాంటి ఒక మూవీ వస్తుందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు.

ఇక ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధించాలంటే మాత్రం దర్శకుడు ఏదో ఒక మ్యాజిక్ ను చేయాలి. లేకపోతే మాత్రం ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించకపోవచ్చు… ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఈ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను తను ఎలా మెప్పిస్తాడు అక్కడ ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడితే బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడిగా బూచి బాబు దిగ్గజ దర్శకుల పక్కన నిలబడతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదం ఉంది. ఒక రకంగా తన మార్కెట్ కూడా భారీగా కోల్పోయే ప్రమాదమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version