The Paradise Movie : సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్న నాని(Natural Star Nani) ఈసారి ‘ది ప్యారడైజ్'(The Paradise) చిత్రం తో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్ పై దృష్టి పెట్టాడు. ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఏ సోషల్ మీడియా మాధ్యమం తీసుకున్నా ఈ టీజర్ పై వేల సంఖ్యలో మీమ్స్ వచ్చాయి. ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని బహుశా మూవీ టీం కూడా ఊహించి ఉండదు. ఒక స్టార్ హీరో పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాకు ఎలాంటి అంచనాలు అయితే ఏర్పడుతాయో, ఈ సినిమా పై కూడా అలాంటి అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది మార్చ్ 26 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు గ్లింప్స్ తోనే అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.
అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని వాయిదా వేశారని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. సినిమా అనుకున్న సమయం కంటే ఆలస్యంగా మొదలు అవ్వడంతో పాటు, స్క్రిప్ట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేయడం వల్ల, పని దినాల సంఖ్య బాగా పెరిగిందని, చెప్పిన సమయానికి సినిమాని విడుదల చేయడం కాస్త కష్టమేనని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. ఈ సినిమా విడుదలైన మరుసటి రోజు, అనగా మార్చ్ 27న రామ్ చరణ్ పెద్ది చిత్రం కూడా విడుదల కాబోతుంది. రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అయితే భారీ నష్టం వాటిల్లుతుంది కదా?, అవసరమైతే మీరు వెనక్కి వెళ్తారా అని నాని ని ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగినప్పుడు, పండగకు ఈమధ్య కాలం లో రెండు మూడు సినిమాలు విడుదల అవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. రెండు కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమాలే కాబట్టి, ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రస్తుతానికి అయితే షెడ్యూల్ ప్రకారమే వెళ్తున్నాము, భవిష్యత్తులో ఏమైనా మారుద్దేమో చూద్దాం అంటూ ‘హిట్ 3’ ప్రొమోషన్స్ సమయం లో చెప్పుకొచ్చాడు నాని.
ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడడంతో ఇక రామ్ చరణ్ పెద్ది కి లైన్ క్లియర్ అయినట్టే. అయితే అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం చూస్తే ‘పెద్ది’ కూడా చెప్పిన తేదీ కి విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పెద్ది స్థానం లో విడుదల అవుతుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ సన్నివేశాల షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఇతర నటీనటులకు సంబంధించిన ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. దీపావళి నుండే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రావడం మొదలు పెడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.