Vrushakarma movie budget hike: ఇండస్ట్రీ లో వారసత్వం ఉన్నంత మాత్రాన సక్సెస్ లు రావు. ఈ విషయం చాలా మంది హీరోల విషయంలో స్పష్టంగా తెలిసిపోయింది… తెలుగు ప్రేక్షులు కేవలం టాలెంట్ కి మాత్రం పట్టం కడుతుంటారు… నాగేశ్వర రావు తనయుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన నాగార్జున మొదట్లో హీరోగా సెటవ్వడనే విమర్శలను ఎదుర్కున్నాడు. అయినప్పటికి తనను తాను మార్చుకున్నాడు కాబట్టే ఆయన స్టార్ హీరో అయ్యాడు…ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక నాగచైతన్య సైతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతుంది. అయితే మొదట ఒక బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బడ్జెట్ కాస్త పెరిగిపోతుందని తద్వారా సినిమాకి భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయనే ధోరణిలో ప్రొడ్యూసర్లు అయితే ఆలోచిస్తున్నారట.
ఇక నాగచైతన్య మార్కెట్ ఎంత దాన్నిబట్టి సినిమాకి బడ్జెట్ ని కేటాయిస్తే బాగుంటుందని పలువురు సినిమా ఇండస్ట్రీ పెద్దలు సైతం భావిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా నాగచైతన్య గత సినిమాలు ఆశించిన మేరకు విజయాలను సాధించలేదు. ‘తండేల్’ మూవీ కొంతవరకు ఓకే అనిపించినప్పటికి ఇప్పుడు ‘వృషకర్మ’ సినిమా విషయంలో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
కలెక్షన్స్ విషయంలో ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో అధిక బడ్జెట్ అనేది మొదటి స్థానంలో ఉంది. కాబట్టి వృషకర్మ లాంటి సినిమాకి ఎక్కువ మొత్తంలో బడ్జెట్ పెట్టడం వల్ల అది రికవరీ అవుతుందా? లేదా అనే ఆలోచనలో కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు…
కానీ దర్శకుడు కార్తీక్ వర్మ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడట. అతన్ని నమ్మి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది… ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…