
Maa elections 2021: ‘తెలుగు మా అధ్యక్ష పదవి’ ఎవరిని వరించబోతుంది ? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. హీరో మంచు విష్ణుకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే, ప్రకాష్ రాజ్ గత రెండు నెలలుగా విజయం కోసం తీవ్రంగా కసరత్తులు చేశాడు. పైగా ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కే విజయం అని కొందరి వాదన. నిజానికి ఓట్లు వేసే మా మెంబర్స్ నాలుగు వందల మంది. ఈ నాలుగు వందల మందిలో 270 మంది వరకు విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారని టాక్.
మెగా ఫ్యామిలీ చెప్పినా మెగాస్టార్ సపోర్ట్ చేస్తున్నా ప్రకాష్ రాజ్ ను ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అంటే.. కారణం నరేషే. నరేష్ పై చాలా మందికి మంచి అభిప్రాయం లేదు. కానీ ఓట్లు వేసే చిన్న నటీనటులలో మాత్రం నరేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తనకున్న పరిచయాలను వాడుకుని మా వ్యవహారం పై తన వంతు పావులు కదిపారు.
అందుకే, విష్ణు బలం పెరిగింది. నరేష్ మాటకు అంత విలువ ఉందా అంటే..? గత కరోనా, అలాగే ఈ కరోనా టైమ్ లో నరేష్ తన వర్గానికి చెందిన రెండు వందల మందికి అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నాడు. వారికీ అండగా నిలబడ్డారు. కాబట్టి, వారంతా నరేష్ చెప్పిన వారికే ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మా ఎన్నికల్లో నరేష్ సపోర్ట్ అత్యంత కీలకమైంది.
పైగా మంచు విష్ణుకి నరేషే స్వయంగా ఫోన్ చేసి.. నీకు నేను సపోర్ట్ చేస్తాను, మా ఎన్నికల్లో (Maa elections 2021) నిలబడు’ అంటూ సలహా కూడా ఇచ్చినట్లు టాక్ ఉంది. అందుకే మంచు ఫ్యామిలీ అందరి కంటే ముందు సూపర్ స్టార్ కృష్ణను కలిసారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ కి చిరు సపోర్ట్ ఉన్నా, పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఒక్క నరేష్ సపోర్ట్ తో ‘మంచు విష్ణు’ గెలిచేలా ఉన్నాడు.
మరోపక్క బాలయ్య కూడా విష్ణు కే సపోర్ట్ చేస్తున్నాడు. ఎన్నికల్లో గెలవాలంటే బాలయ్య మద్దతు చాలా అవసరం. ‘మా’ మెంబర్స్ లో బాలయ్య వర్గం కూడా బలంగా ఉంది.