MAA Elections: మా ఎన్నికల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోటీ పడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. గెలుపుపై ఎవరికి వారే దీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా మంచు విష్ణు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పెదవి విప్పారు. పవన్ కల్యాణ్ ప్రకాశ్ రాజ్ వైపు ఉన్నారని చెప్పారు. పవన్ మాటలతో ఏకీభవించడం లేదని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలను సినిమా పరిశ్రమ ఒప్పుకోవడం లేదని వివరించారు. మా ఎన్నికల్లో పవన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లు గా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏర్పడిన వివాదాన్ని మంచు విష్ణు మా ఎన్నికలతో ముడిపెట్టారు. తాను పరిశ్రమ వైపు ఉన్నానని వవన్ కల్యాణ్ ఎటు వైపు ఉంటారో తేల్చుకోవాలని సవాల్ చేశారు. దీంతో విష్ణు వ్యాఖ్యల వల్ల మా ఎన్నికల ఎజెండా మారిపోయింది. దీంతో మా ఎన్నికల్లో పోటీ పెరిగిపోతోంది. ఇద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మాది అసలైన ప్యానల్ అంటే మాదంటూ పేర్కొంటున్నారు.
ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రేగిన దుమారం సంచలనం అవుతోంది. సినిమాతో రాజకీయ సంబంధాలు పెనవేసుకుని ఉండడంతో మా ఎన్నికల్లో పరిస్థితులు ఎటు వైపు వెళతాయో అర్థం కావడం లేదు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్లు అత్యధిక ఓట్లు సాధించే క్రమంలో ముందుకు వెళ్తున్నారు. ఎవరికి మెజార్టీ వస్తే వారి వాదమే గెలుస్తుందని తెలుస్తోంది.
మంచు విష్ణు మాత్రం వ్యూహాత్మకంగా చేసినా ఉద్దేశపూర్వకంగా చేసినా ఎజెండా మాత్రం సెట్ అయిపోయిందని తెలుస్తోంది. ఈ కోణంలో మా ఎన్నికల్లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో ఏ ప్యానల్ విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే. ఇద్దరు నేతలు ఏ మేరకు సక్సెస్ సాధిస్తారోనని ఎదురు చూస్తున్నారు.