https://oktelugu.com/

Kannappa Movie :  కన్నప్ప సినిమా మరో ఆదిపురుష్ అవ్వనుందా..? ప్రభాస్ అనవసరంగా కమిట్ అయ్యాడా..?

ఇక 15 కోట్ల మార్కెట్ కూడా లేని మంచు విష్ణు కేవలం ప్రభాస్ ని బేస్ చేసుకుని 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు

Written By:
  • NARESH
  • , Updated On : February 17, 2024 / 08:39 PM IST
    Follow us on

    Kannappa Movie : మంచు విష్ణు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా భక్తకన్నప్ప. ఈ సినిమా మీద మంచు విష్ణు భారీ అంచనాలను పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను ప్రభాస్ తో షూట్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నాడు అంటు చాలా రోజులుగా వార్తలైతే వస్తున్నాయి.

    అయితే దీని మీద ప్రభాస్ అఫీషియల్ గా ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో ప్రభాస్ అభిమానులు కొంతవరకు డైలమాలో అయితే ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమాలో చేస్తున్నాడా లేదా పబ్లిసిటీ స్టంట్ కోసం మంచు విష్ణు ప్రభాస్ పేరుని వాడుకుంటున్నాడా అనే విషయం లో కూడా వాళ్ళకి క్లారిటీ అయితే రావడం లేదు.

    ఒకవేళ ఈ సినిమాని కనక ప్రభాస్ ఒప్పుకొని చేసినట్లయితే ఈ సినిమా మరొక ‘ఆది పురుషు’ సినిమా అవుతుందా అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా మీద విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడైన ఓం రావత్ ప్రభాస్ కి భారీ డిజాస్టర్ ని ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో మంచు విష్ణు కూడా ఆయన కు మరో భారీ డిజాస్టర్ ఇస్తాడా అని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. ఇక సాఫీగా సాగుతున్న కెరియర్ కి మళ్ళీ తలకాయ నొప్పులు అవసరమా అంటూ ప్రభాస్ మీద మరి కొంతవరకు ఫైర్ అవుతున్నారు. మొహమాటానికి పోతే మనకు డ్యామేజ్ జరుగుతుంది అనేది కూడా గుర్తించుకోవాలి అంటూ ఇంకొంతమంది ప్రభాస్ ని హెచ్చరిస్తున్నారు.

    నిజానికి ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అందువల్లే ఎవరు ఏమి అడిగినా కాదనకుండా చేసేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే మంచు విష్ణు అడగడంతో తను కాదనలేక ఆ క్యారెక్టర్ పోషిస్తున్నాడు అంటూ మరికొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక 15 కోట్ల మార్కెట్ కూడా లేని మంచు విష్ణు కేవలం ప్రభాస్ ని బేస్ చేసుకుని 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో.. మరి ఇలాంటి సమయంలో ప్రభాస్ కూడా ఈ సినిమాతో రిస్క్ చేస్తున్నాడా? అని సినీ మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…