NTR: ఏపీలో థియేటర్ టికెట్ రేట్ల విషయంలో జగన్ నిర్ణయం మారటం అసాధ్యం అని సినిమా వాళ్ళకు అర్ధం అయిపోయింది. ఇక ఉమ్మడిగా టికెట్ రేట్లు పెంచమని ప్రయత్నాలు చేస్తే అసలుకే మోసం వస్తోందని.. ఎవరికీ వాళ్ళు మా సినిమాకైనా రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అంటూ లాబీయింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తమ సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు వ్యవహారం పై ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసంతృప్తితో పనులు అవ్వవు. అందుకే, రాజమౌళి రంగంలోకి దిగాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఇమేజ్ ను వాడుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. టికెట్ రేట్లు పెంచకపోతే కచ్చితంగా “ఆర్ఆర్ఆర్”కు భారీ నష్టం వస్తోంది.
ఎందుకంటే అన్నీ ఏరియాల్లో భారీ రేట్లకు అమ్మారు. అంత డబ్బు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఏమి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఉన్న టికెట్ రేట్లతో సినిమా రిలీజ్ సగం డబ్బు పొగొట్టుకోవాల్సి వస్తోంది. అందుకే, ఎన్టీఆర్ తరఫున మంత్రి కొడాలి నాని రంగంలోకి దిగాడట. మంత్రి కొడాలి నానికి ఎన్టీఆర్ కి మధ్య మంచి స్నేహం ఉంది.
పైగా గతంలో కొడాలి నాని ఎన్టీఆర్ తో “సాంబ” సినిమా తీశాడు కూడా. ఒక విధంగా కొడాలి నానికి మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ రావడానికి హరికృష్ణ గారే కారణం. తన రాజకీయ గురువు కూమారుడు ఎన్టీఆర్. అందుకే కొడాలి నాని ఎన్టీఆర్ ను కూడా అంతే ప్రేమిస్తూ ఉంటాడు.
Also Read: Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు… అసలేం జరిగిందంటే ?
ఎలాగూ జగన్ ప్రభుత్వంలో కీలక మంత్రి కాబట్టి. .. తాను చెబితే జగన్ అంగీకరించే పరిస్థితి ఉంది కాబట్టి.. ఈ విషయంలో ముఖ్యమంత్రి మనసు మార్చి.. ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లను పెంచేలా కొడాలి ప్రస్తుతం లాబీయింగ్ చేస్తున్నాడు.
అయితే, వై.ఎస్. జగన్ ఒకసారి ఫిక్స్ అయ్యాక, మళ్లీ ఛేంజెస్ ఉండవు అని అంటుంటారు. మరి ఎన్టీఆర్ – నాని కోసం జగన్ తన నిర్ణయం మార్చుకుంటారా ? చూడాలి.
Also Read: Mahesh Allu Arjun Balakrishna: ఓకే రూట్ లో మహేష్, అల్లు అర్జున్, బాలయ్య