Mahesh Babu-Namrata : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రిన్స్ (Prince)గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు (Mahesh Babu)…రాజకుమారుడు (Rajakumarudu)సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో సూపర్ స్టార్(Super Star) ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు. అయితే బి. గోపాల్ (B.Gopal) డైరెక్షన్ లో వచ్చిన వంశీ (Vamshi) సినిమాలో నమ్రత శిరోడ్కర్ తో కలిసి నటించిన మహేష్ బాబుకి ఆమెతో మంచి పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరి అభిప్రాయాలు కలవడంతో మంచి స్నేహితులయ్యారు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించి 2005 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీళ్ళ వివాహం జరిగి ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహేష్ బాబు ఒక ఆసక్తికరమైన పోస్ట్ అయితే పెట్టాడు…
‘నువ్వు నేను అందమైన 20 వసంతాలు ఎప్పటికీ నీతోనే నమ్రత’ అంటూ రాసుకుంటునే వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమమైన అన్యోన్యమైన దంపతులు ఎవరు అంటే అందరూ మహేష్ బాబు నమ్రతల పేర్లను చెబుతూ ఉంటారు. వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని 20 సంవత్సరాలుగా ఎలాంటి గొడవ లేకుండా, ఎప్పుడు కాంట్రవర్సీల్లో నిలవకుండా కలిసి మెలిసి ఉండటం అనేది మామూలు విషయం కాదు.
ఈ దంపతులు ఇప్పుడున్న యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ఈ సినిమాతో భారీ రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా మహేష్ బాబు పేరు హాలీవుడ్ లో కూడా భారీగా వినిపించబోతుంది.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న మహేష్ బాబు తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చే సక్సెస్ తో ఆయన హాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇవ్వబోతున్నాడనేది వాస్తవం… ఈ సినిమా హాలివుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక వైవిధ్యమైన గుర్తింపును సంతరించుకుంటుందనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తోంది…