Julayi movie be an industry hit
Allu Arjun : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకి మంచి క్రేజ్ అయితే ఉంటుంది. అయితే ఒకప్పుడు వాళ్ళు చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచినప్పటికి వాళ్లకి ఉన్న క్రేజ్ వల్ల ఆ సినిమాలు అప్పుడు అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించావు. కారణం ఏంటి అంటే వాళ్ళు అప్పటికి స్టార్ హీరో స్టేటస్ ని అనుభవిస్తూ ఉండరు కాబట్టి సూపర్ హిట్ సినిమాలు కూడా ఒక మాదిరి సక్సెస్ ని మాత్రమే సాధిస్తాయి. ఇక వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదిగిన తర్వాత వచ్చిన సినిమాలు కేవలం అవరేజ్ గా ఆడిన కూడా ఆ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకుంటారు. ఇక వరుస సినిమాలతో భారీ సక్సెస్ ని మూట గట్టుకున్న అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇంతకుముందు ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను కూడా సంపాదించి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన జులాయి సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. నిజానికి ఆ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది.
అలాంటి ఒక సినిమా ఇప్పుడు కనక వచ్చినట్లైతే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సంచలనాలను కూడా క్రియేట్ చేసేది అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో జులాయి సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది. అప్పట్లో అల్లు అర్జున్ కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇక ఏది ఏమైనా జులాయి లాంటి సినిమా కోసం అల్లు అర్జున్ విపరీతంగా శ్రమించిన విషయం మనకు తెలిసిందే.
మరి ఆ సినిమాకు తగ్గ సక్సెస్ వచ్చినప్పటికి ఇప్పుడు కనక ఆ మూవీ వచ్చినట్లైతే అది ఒక భారీ ఇండస్ట్రీ హిట్ గా మారేది… ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకునే స్టార్ హీరోలు ఇండస్ట్రీలో ఉన్నప్పటికి అల్లు అర్జున్ కి మాత్రం ఇప్పుడు సపరేట్ క్రేజ్ అయితే దక్కుతుంది…