https://oktelugu.com/

Allu Arjun : జనవరి 12 న అల్లు అర్జున్ కి మళ్ళీ బెయిల్ వస్తుందా..? లేదంటే కేసు మొత్తం కొట్టేస్తారా..?ఏం జరగబోతోంది..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు సాధించనటువంటి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు ఇకమీదట కూడా అదే రీతిలో ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది...

Written By: , Updated On : December 27, 2024 / 01:27 PM IST
Allu Arjun

Allu Arjun

Follow us on

Allu Arjun : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు సాధించనటువంటి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు ఇకమీదట కూడా అదే రీతిలో ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది…అలాంటి విజయాలను దక్కించుకున్నప్పుడే వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదగడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ని కూడా మరొక మెట్టు పైకి ఎక్కిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సినిమాలను తీస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరోలుగా మారుతున్న క్రమంలో కొంతమంది హీరోలు అనుకోకుండా కొన్ని కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా వారు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారనేది మాత్రం వాస్తవం. ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ మీద కేసు అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కేసు విషయంలో ఆయన మధ్యంతర బేయిల్ మీద బయట తిరుగుతున్నాడు. మరి జనవరి 12వ తేదీన కోర్టుకు ఆయన హాజరవ్వాల్సిన అవసరమైతే ఉంది. మరి ఈ సందర్భంలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్ట్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది. అతనికి మరోసారి బెయిల్ ని ఇస్తుందా? లేదంటే ఆ కేసు ని కొట్టేస్తుందా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ తరుపున న్యాయవాదులు అయిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డిలు పూర్తి పకడ్బందీ ప్రూఫ్ లతో అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని నిరూపించడానికి భారీ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మరి వీళ్లకు తగ్గట్టుగానే అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లు కూడా వాళ్ళ తప్పేమీ లేదు అనే రేంజ్ లో అయితే ఆధారాలను సేకరిస్తున్నారట. మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ తప్పయితే లేదు అంటూ కొంతమంది అతన్ని సమర్థిస్తున్నారు.

మరి అల్లు అర్జున్ కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సంవత్సరం ప్రకారం అయితే దీనికి పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని అల్లు అర్జున్ ఏ విధంగా బాధ్యుడు కాదు. థియేటర్ యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం వల్లే ఆ ఘటన జరిగింది.

దానికి అనవసరంగా అల్లు అర్జున్ ను బ్లేయిమ్ చేస్తున్నారంటూ ఒక వర్గం జనాలు సైతం అల్లుఅర్జున్ కి సపోర్టుగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మాట్లాడిన మాటల్లో కూడా కొంతవరకు న్యాయం ఉందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా రిలీజ్ రోజున తమ అభిమానులను సంతోష పరచడానికి హీరో థియేటర్ కి రావడం అనేది సర్వసాధారణం…ఇక థియేటర్ యజమాన్యం దానికి తగ్గ ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరమైతే ఉంది.

వాళ్ళు విఫలమై అల్లు అర్జున్ వల్లే ఇలా జరిగింది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి జనవరి 12వ తేదీన అల్లు అర్జున్ తన తప్పేమీ లేదని నిరూపించుకొని బయటికి రాబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి జనవరి 12వ తేదీన ఏం జరగబోతుంది అనేది…