https://oktelugu.com/

Akkineni Family : నాగచైతన్య, అఖిల్ ల పెళ్లి ఒకేరోజు జరుగబోతోందా? నాగార్జున ఏం ప్లాన్ చేస్తున్నాడు..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతు ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు కూడా ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 26, 2024 / 07:59 PM IST

    Akkineni Family

    Follow us on

    Akkineni Family :  చాలా రోజుల తర్వాత అక్కినేని ఫ్యామిలీలో పండగ వాతావరణం అయితే నెలకొంది. చాలా సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి సేవలు చేస్తూ వస్తున్న ఈ ఫ్యామిలీలో గత కొంతకాలం నుంచి పెద్దగా సంతోష కరమైన వాతావరణమైతే ఉండడం లేదు. ఇక ఎప్పుడైతే నాగచైతన్య సమంతల మధ్య డివోర్స్ జరిగాయో ఇటు సినిమా లైఫ్ లో గాని, పర్సనల్ లైఫ్ లో గాని వాళ్ళ కి అంత పెద్దగా ఆనందాన్ని కలిగించే విషయాలైతే జరగడం లేదు. ఇక ఎట్టకేలకు నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీలో చాలావరకు శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు అఖిల్ జైనబ్ రివ్జి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయాల మీద పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీన నాగ చైతన్య శోభితల పెళ్లి జరగబోతుంది. ఇక అన్నపూర్ణ స్టూడియోలో వీళ్ళ పెళ్లికి సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ జైనబ్ రివ్జీ ల పెళ్లి కూడా అదే రోజున జరగబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆ రోజునే వీళ్లిద్దరి పెళ్లి గనక జరిగినట్టయితే అదొక అరుదైన రికార్డుగా నిలవడమే కాకుండా అక్కినేని అభిమానుల్లో ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.

    ఇక గత కొద్ది రోజుల నుంచి నాగార్జున తన కొడుకులకు పెళ్లిళ్లు చేయడం లేదనే ఒక చిన్నపాటి డిప్రెషన్ లో ఉంటున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక ఎట్టకేలకు ఇద్దరు కొడుకులకు పెళ్లి సెట్ అయింది. దాంతో ఒకేరోజు ఇద్దరి పెళ్ళిళ్ళు చేయాలనే ప్రయత్నంలో నాగార్జున ఉన్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు మీద సరైన స్పష్టత లేదు కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరి పెళ్లిని ఒకేరోజు జరిగితే అక్కినేని అభిమానులు చాలావరకు ఆనందపడే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ ఇటు పర్సనల్ గా, అటు సినిమాల పరంగా కూడా ఇక మీద రాణించబోతున్నట్టుగా కొన్ని సంకేతాలైతే వస్తున్నాయి. ఇక ఎవరికి వాళ్లు లైఫ్ లో సెటిల్ అవ్వడమే కాకుండా సినిమాలపరంగా కూడా భారీ సక్సెస్ లను అందుకొని ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి పోటీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు.

    ఇప్పటికే నాగచైతన్య ‘తండెల్’ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక అఖిల్ కూడా మరొక భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక నాగార్జున అటు హీరోగా, ఇటు విలన్ గా చేస్తూ పలు రకాల పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు…