‘వైల్డ్ డాగ్’ బాలీవుడ్ రీమేక్‌.. అంతా హంబ‌క్కేనా?

విడుద‌ల‌కు ముందు సినిమా ప్ర‌మోష‌న్స్ ఎలా ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. క‌థ నుంచి మొద‌లు పెడితే.. టేకింగ్‌, మేకింగ్ గురించి బంబాట్ గా ప్ర‌చారం చేస్తుంటారు. కానీ.. వాళ్లు ప‌ది విష‌యాలు చెబితే.. అందులో ఒక‌టో, రెండో మాత్ర‌మే వాస్త‌వాలు ఉంటాయి. తాజాగా వైల్డ్ డాగ్ విష‌యంలోనూ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లే చేశారు నిర్మాత‌. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇందులో హీరోగా మాములు స్టార్ ను ప్ర‌క‌టించ‌లేదు. ఏకంగా.. అమీర్ ను రంగంలోకి […]

Written By: Bhaskar, Updated On : April 7, 2021 12:28 pm
Follow us on


విడుద‌ల‌కు ముందు సినిమా ప్ర‌మోష‌న్స్ ఎలా ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. క‌థ నుంచి మొద‌లు పెడితే.. టేకింగ్‌, మేకింగ్ గురించి బంబాట్ గా ప్ర‌చారం చేస్తుంటారు. కానీ.. వాళ్లు ప‌ది విష‌యాలు చెబితే.. అందులో ఒక‌టో, రెండో మాత్ర‌మే వాస్త‌వాలు ఉంటాయి. తాజాగా వైల్డ్ డాగ్ విష‌యంలోనూ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లే చేశారు నిర్మాత‌.

ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇందులో హీరోగా మాములు స్టార్ ను ప్ర‌క‌టించ‌లేదు. ఏకంగా.. అమీర్ ను రంగంలోకి దించ‌బోతున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఇదంతా సినిమా విడుద‌ల‌కు ముందు ప‌రిస్థితి. మ‌రి, ఇప్పుడు ఏంట‌న్న‌దే ప్ర‌శ్న‌.

ఏప్రిల్ 2న విడుద‌లైన ఈ సినిమాకు పాజిటివ్ టాకే వ‌చ్చింది. కానీ.. సినిమా చూసేందుకు ఆడియ‌న్సే క‌రువ‌య్యారు. సీరియ‌స్ మోడ్ లో సాగిపోయే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కూ చేరువ కాలేక‌పోయిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. దీంతో.. సినిమా న‌ష్టాల‌ను చ‌విచూసే అవ‌కాశం కూడా ఉందంటున్నారు.

మ‌రి, ఇలాంటి ప‌రిస్థితుల్లో వైల్డ్ డాగ్ ను హిందీలో రీమేక్ చేయ‌డం జ‌రిగే ప‌నేనా అంటున్నారు సినీ జ‌నాలు. అంతేకాదు.. ఇప్ప‌టికే బాలీవుడ్లో వ‌చ్చిన ఉరి, బేబీ వంటి సినిమాల్లోని థ్రిల్ల‌ర్ తో కంపేర్ చేస్తే ‘వైల్డ్ డాగ్‌’ ర్యాంక్ తక్కువేనని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆ సినిమాలతోనే ‘వైల్డ్ డాగ్’ స్ఫూర్తి పొందిందని కూడా అంటున్నారు. కాబట్టి.. వైల్డ్ డాగ్ బాలీవుడ్ ప్రయాణం అంతా హంబక్కేనని, సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన ప్రచారమే తప్ప, ఇందులో వాస్తవం ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.