Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi not invited Vijay Rashmika wedding: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లికి చిరంజీవి...

Chiranjeevi not invited Vijay Rashmika wedding: విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లికి చిరంజీవి కి ఇన్విటేషన్ ఇవ్వలేదా..? కారణమేంటంటే..?

Chiranjeevi not invited Vijay Rashmika wedding: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ కెరీర్ ని చాలా సాఫీగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ లాంటి నటుడు సైతం అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెను తిరిగి చూడకుండా భారీ సక్సెస్ ల మీద సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన రష్మిక మందానను పెళ్లి చేసుకుంటున్నాడనే విషయం అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 26వ తేదీన వీరిద్దరి పెళ్లికి చాలా తక్కువ మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరు కాబోతున్నారట. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు సైతం పెళ్లికి ఇన్విటేషన్ అయితే ఇవ్వలేదట. ఈ పెళ్లి రాజస్థాన్ లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో జరుగుతుందట… హైదరాబాద్లో నిర్వహించే రిసెప్షన్ కి మాత్రం ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు, సెలబ్రిటీలకు అలాగే రాజకీయ నాయకులకు ఆహ్వానం అయితే అందిందట.

మొత్తానికైతే పెళ్లి మాత్రం చాలా గోప్యంగా చేసుకొని రిసెప్షన్ చాలా గ్రాండ్ గా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో అటు విజయ్, ఇటు రష్మిక ఉన్నారు. ఇక మొత్తానికైతే వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ పెళ్లిని సక్సెస్ ఫుల్ గా చేసుకొని అంతే పద్ధతిగా ఇకముందు తమ కెరీర్ ని కూడా లీడ్ చేసుకుంటారని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు.

సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే సినిమా సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకుంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముందుకు సాగితే మంచిదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు…

ఇక ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్లో గీతగోవిందం డియర్ కామ్రేడ్ అనే సినిమాలు వచ్చాయి ప్రస్తుతం రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ‘రణబలి’ అనే సినిమాని చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. వీళ్ళకి ఎలాంటి గుర్తింపుని తీసుకొచ్చి పెడుతుంది అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular