Nagarjuna – Venkatesh : అక్కినేని ఫ్యామిలీ నుంచి రెండో తరం హీరోగా వచ్చిన నాగార్జున మొదట్లో హీరో గా పనికిరాడు అంటూ చాలామంది దర్శక, నిర్మాతలు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయినప్పటికీ నాగేశ్వరరావు ఎక్కడ కూడా తగ్గకుండా నాగార్జునని స్టార్ హీరోగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. అలాంటి క్రమం లో నాగార్జున చేసిన కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరి కొన్ని సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. అయితే నాగేశ్వరరావు మాత్రం నాగార్జునని స్టార్ హీరోని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అందులో భాగంగానే వర్మ లాంటి దర్శకున్ని ఎంకరేజ్ చేసి తన చేత ‘శివ’ అనే సినిమా చేయించి నాగార్జున ని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మార్చాడు.
ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీ లో పెద్ద నిర్మాత గా పేరుపొందిన డాక్టర్ డి రామానాయుడు కూడా అదే సమయంలో వెంకటేష్ ను హీరోగా పరిచయం చేశాడు. ఇక వెంకటేష్ చాలా తక్కువ సమయం లోనే హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక నాగ్, వెంకీ ఇద్దరు కూడా ఒకే టైంలో ఇండస్ట్రీకి రావడం, ఇద్దరూ ఆ తర్వాత బంధువులుగా మారడం కూడా జరిగింది. అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య ఎప్పుడు పోటీ ఉండేదని అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. నిజానికి నాగార్జునని కాదని వెంకటేష్ స్టార్ హీరోగా చాలా కాలం పాటు దూసుకుపోయాడు.
ఇక ఈ విషయాన్ని గమనించిన నాగేశ్వరరావు వెంకటేష్ తన కొడుకు కంటే పెద్ద హీరోగా ఎదుగుతున్నాడని తెలుసుకొని నాగార్జున ను కూడా స్టార్ హీరోని చేయాలనే ఉద్దేశ్యంతో నాగార్జునతో మంచి కాంబినేషన్స్ సెట్ చేసి తనే దగ్గరుండి మరి నాగార్జున స్టార్ హీరోగా ఎదగడంలో కీలకపాత్ర వహించాడు అనే చెప్పాలి. అయితే వెంకటేష్ సిస్టర్ అయిన లక్ష్మిని నాగార్జున పెళ్లి చేసుకొని నాగ చైతన్య పుట్టిన తర్వాత లక్ష్మి కి డివోర్స్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆ విషయంలో వెంకటేష్ కి, నాగార్జున కి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉండేవని, దానివల్ల వీళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుకునేవారు కాదని అందుకే ఒకరి సినిమాలకి పోటీగా మరొకరు వాళ్ల సినిమాలను రిలీజ్ చేస్తూ ఉండేవారు అంటూ అప్పట్లో మీడియాలో విపరీతమైన కథనాలు వచ్చేవి…
కానీ వీరిద్దరి మధ్య పోటీ అనేది సినిమాల పరంగానే ఉండేది తప్ప వ్యక్తిగత విషయాల్లో ఎలాంటి పోటీ ఉండేది కాదు అంటూ వీళ్ళిద్దరూ కూడా చాలాసార్లు స్పష్టం చేశారు. అయిన కూడా ఆ వార్తలు ఎప్పుడు వస్తూనే ఉండేవి, ఇక నాగ చైతన్య హీరో చేస్తున్న తండేల్ సినిమా ముహూర్తానికి వీళ్ళిద్దరూ చీఫ్ గెస్ట్ లుగా రావడం,అక్కడ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడంతో అది చూసిన అక్కినేని, దగ్గుబాటి అభిమానులు చాలా సంతోషపడ్డారనే చెప్పాలి…