https://oktelugu.com/

Trivikram – Rana : త్రివిక్రమ్ రానా కాంబోలో రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..?

ఇక ఎలాగూ రానాతో చేయాలనుకున్న సబ్జెక్టు తన దగ్గర ఉంది కాబట్టి తనకు చేసే టైం లేదని వేరే డైరెక్టర్ తో త్రివిక్రమ్ ఈ సినిమాని చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది...చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందనేది...

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 06:30 PM IST

    Trivikram Rana

    Follow us on

    Trivikram – Rana : సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ యొక్క బాధ్యత ఎంతలా ఉంటుందంటే ఒక సినిమా విజయంలోగానీ, అపజయం లో గానీ రైటర్ మాత్రమే మొదటగా కీలకపాత్ర వహిస్తాడు. ఎందుకంటే ఒక కథ బాగుంటేనే సినిమా అనేది సక్సెస్ అవుతుంది. కథలో బలం లేకపోతే మాత్రం ఆ సినిమాకి ఎన్ని రంగులద్దిన ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా కథ లేకపోతే మాత్రం సినిమా ఆడదు అనే విషయం ఇప్పటికీ చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు లో తనదైన కథ మాటలు రాసి ప్రేక్షకుల్ని మెప్పించిన ఒకే ఒక్క రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్…

    ఈయన రైటర్ గా సూపర్ సక్సెస్ అయిన తర్వాత డైరెక్టర్ గా కూడా మంచి సినిమాలను చేసి సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇక ఇలాంటి త్రివిక్రమ్ స్టార్ హీరోలందరితో సినిమాలను చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే తెలుగులో మంచి హీరోగా గుర్తింపు పొందిన రానాతో అప్పట్లో ఒక భారీ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. దానికి సంబంధించిన కథను కూడా రాసుకొని రానా కి వినిపించాడట. అయినప్పటికీ అప్పట్లో త్రివిక్రమ్ ఉన్న బిజీ కారణంగా ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కథ మాటలు అందిస్తున్న ‘హిరణ్య కాశ్యప’ సినిమాలో రానా లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.

    అయితే ఒకప్పుడు ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ చేయాలనుకున్నాడు,కానీ వీలు కాలేదు. ఇక అదే సినిమాకి ఇప్పుడు కథ,మాటలు అందిస్తూ ఒక పెద్ద బాధ్యతను అయితే మోస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమాను డైరెక్షన్ చేసినట్లయితే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉండేవని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఎలాగూ రానాతో చేయాలనుకున్న సబ్జెక్టు తన దగ్గర ఉంది కాబట్టి తనకు చేసే టైం లేదని వేరే డైరెక్టర్ తో త్రివిక్రమ్ ఈ సినిమాని చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందనేది…