Telugu Heroines: తెలుగు వెండితెరపై తెలుగు అమ్మాయిలకు ఆదరణ ఉండదు అని చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట ఇది. మరి తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఎందుకు రాణించలేక పోతున్నారు ? అందం, అభినయం ఉన్నా హీరోయిన్లు ఎందుకు కాలేకపోతున్నారు ? అనే అంశం చుట్టూ చాలా కారణాలు ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్, పరాయి నటీమణుల పోటీ ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.
కానీ, వాస్తవానికి అసలు కారణం భయం. హీరోయిన్లు అవుదామనుకున్నా వచ్చే అమ్మాయిలకు ఒక రకమైన భయం. తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకునే తెలుగు దర్శకనిర్మాతలకు మరో రకమైన భయం. ఏ సినిమాని అయినా కొన్ని కమర్షియల్ లెక్కల మధ్యలోనే తీయాలి. కాబట్టి.. ఆ కమర్షియల్ అంశాలు అన్నీ హీరోయిన్ చుట్టే తిరుగుతాయి.
అందుకే, ఈ క్రమంలో తెలుగు అమ్మాయి కంటే.. ముంబై భామలతో పని చాలా ఈజీగా అయిపోతుంది. పైగా ముంబై హీరోయిన్లు చాలా ఓపెన్ గా ఉంటారు. వాళ్లు సినిమా వాతావరణానికి తగ్గట్టు పూర్తిగా మారిపోతారు. కానీ, తెలుగు అమ్మాయిలు అలా కాదు. ఒకవేళ వాళ్ల పై ఒత్తిడి పెంచి రొమాంటిక్ సన్నివేశాలలో నటింపజేస్తే.. తనను బలవంతపెట్టారు అంటూ దాన్ని పెద్ద ఇష్యు చెయ్యొచ్చు.
Also Read: పాత సినిమాకి కొత్త టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా ?
ఆ ఇష్యు పెద్దది అయితే, అందరూ బజారున పడతారు. అందుకే వీలైనంత వరకు తెలుగు అమ్మాయిలను హీరోయిన్ లుగా తీసుకోరు. అక్కడక్కడా కొందరు తెలుగు హీరోయిన్ లు కూడా వస్తున్నారు. రొమాన్స్ పరిధి దాటినా, వ్యాంప్ పాత్రలు అయినా అందాల ఆరబోతకు రెడీ అంటూ వాళ్ళు ముందుకు వస్తున్నారు. పైగా కాలం మారింది, జనరేషన్స్ కూడా మారాయి.
దాంతో ప్రస్తుత కొందరు తెలుగు హీరోయిన్లు కొన్ని మితి మీరిన రొమాంటిక్ సీన్స్ చేయడానికి బాగా అలవాటు పడ్డారు. పైగా నటనకు అవకాశం ఉన్న సినిమాలు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో తెలుగు హీరోయిన్స్ ఇంకా పెరుగుతారని ఆశిద్దాం.
Also Read: నచ్చినట్లు చేసే కదా ఈ పరిస్థితి తెచ్చుకున్నావ్.. హీరో పై సెటైర్లు !