Nagarjuana
Nagarjuna : సినిమా ఇండస్ట్రీ లో నట వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వసాధారణం జరిగిపోతుంది. ఇక ఇప్పటికే పెద్ద ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి వీళ్ళు చేస్తున్న ఈ సినిమాల విషయంలో స్టార్ హీరోలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా చిరంజీవి తన కొడుకు అయిన రామ్ చరణ్ ను స్టార్ హీరోగా మార్చడంలో సూపర్ సక్సెస్ ని సాధించాడు. కానీ నాగార్జున మాత్రం తన కొడుకులను సక్సెస్ ఫుల్ హీరోలుగా మార్చలేకపోయాడు కారణం ఏంటి అంటే నాగార్జున వాళ్ళ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి మొదటి సినిమా కోసం స్టార్ డైరెక్టర్స్ ను ఎంచుకోకపోవడమే ఆయన చేసిన మొదటి తప్పని చాలా మంది భావిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమా కోసం వాసు వర్మ అనే ఒక కొత్త డైరెక్టర్ ని తీసుకోవడం అనేది చాలా రాంగ్ స్టెప్ అంటూ చాలామంది అభివర్ణిస్తున్నారు. నాగార్జున ఉన్న స్టేటస్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు ఎవరో ఒకరు తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే వాళ్ళు కానీ ఆయన అలా చేయకుండా కొత్త దర్శకుడి చేతులో తన కొడుకుని పెట్టడం అనేది నాగ చైతన్య కెరియర్ ను కోలుకోవాలని దెబ్బ కొట్టిందనే చెప్పాలి…
ఇక ఇదిలా ఉంటే అఖిల్ ను వి వి వినాయక చేతిలో పెట్టి అఖిల్ సినిమాతో ఆయన భారీ ప్లాప్ నైతే మూటగట్టుకునేలా చేశాడు. ఇక అప్పటివరకు వివి వినాయక్ సాధిస్తే వస్తున్నప్పటికీ అప్పుడే ఆయన కెరియర్ డౌన్ ఫాల్ కి మరి ఇలాంటి సందర్భంలో అఖిల్ ని తన చేతిలో పెట్టి ఒక పెద్ద సాహసమే చేశాడనే చెప్పాలి.
ఇక దానివల్ల ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దలేకపోయిన వివి వినాయక్ చేతులెత్తేసాడు. ఇక దాంతో అఖిల్ మొదటి సినిమాతోనే భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అఖిల్ కెరియర్ అనేది కోలుకోలేకుండా పోతుంది.
అందుకే తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్లాలనుకుంటున్న ఈ స్టార్ హీరోలకు మొదట్లోనే భారీ దెబ్బ తగలడంతో అక్కినేని ఫ్యామిలీ కోలుకోలేక పోతుంది. మరి ఇప్పటికైనా వాళ్ళు మంచి సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తే స్టార్ హీరోలుగా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి…