Jr NTR : కార్లంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి? ఇక, స్టార్ స్టేటస్ ను మెయింటెయిన్ చేసేవారి గురించి చెప్పాల్సిన పనేలేదు. మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తే.. దానిపై కన్ను పడుతుంది. వాళ్ల స్టేచర్ ను చాటుకునేందుకు ఖరీదైన కార్లు వాడుతుంటారు. సినీ సెలబ్రిటీలుగా ఉన్నవారు కూడా ఇదే విధంగా కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.
ఆయన గ్యారేజ్ లో ఒకటీ రెండు కాదు పదికి పైగా కార్లు ఉన్నాయి. ఈ మధ్యనే లగ్జరీ బ్రాండ్ లాంబోర్ఘినీ కారును కొనుగోలు చేశారు జూనియర్. ఐదు సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడును అందుకునే.. ఈ లాంబోర్ఘినీ ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ లో రయ్య్ మంటూ దూసుకెళ్లొచ్చు. ఈ కారు ధర ఇండియాలో మూడున్నర కోట్లకు పైమాటే. ఈ కారును తీసుకున్నాడు ఎన్టీఆర్.
అయితే.. ఎన్నికార్లు కొనుగోలు చేసినా, జూనియర్ కార్లన్నింటికీ ఒకటే నంబర్ ఉంటుంది. అదే.. 9999. ముందు ఆల్ఫాబెట్ మారుతుంది తప్ప, నంబర్ మాత్రం ఇదే ఉంటుంది. ఇలాంటి నంబర్ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. లక్షల్లో చెల్లించాల్సి వస్తుంది. అయినప్పటికీ.. అంత డబ్బు చెల్లించి ఇదే నంబర్ ను తీసుకుంటాడు జూనియర్.
కారణం ఏమంటే.. సీనియర్ ఎన్టీఆర్ అంబాసిడర్ కారుకు ఇదే నంబర్ ఉండేది. ఆ తర్వాత జూనియర్ తండ్రి హరికృష్ణ కూడా 9999 నంబర్ నే వినియోగించారు. దీంతో.. ఈ విషయంలోనూ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు జూనియర్. పైగా.. తనకు 9 నంబర్ ఇష్టమట. అందుకే.. ఈ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఇదే నంబర్ ను వాడుతున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల స్వయంగా చెప్పాడు జూనియర్.