Mirai: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం కొత్త కథలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే భారీ గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన హీరోలు సైతం ఉన్నారు. మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా ఆ తర్వాత సోలో హీరోగా మారి మంచి సినిమాలను చేస్తున్నాడు… ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘హనుమాన్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో కూడా మంచి విజయాన్ని అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ‘మిరాయి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక మిరాయి సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరగడానికి గల కారణం ఏంటి అంటే ట్రైలర్ ను చాలా అద్భుతంగా కట్ చేశారు. ఇక దానికి తోడుగా ట్రైలర్ లో వచ్చిన సీజీ షాట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి.
ఇక ఈ మధ్యకాలంలో భారీ రేంజ్ లో ఖర్చుపెట్టి తీసిన సినిమాలు సైతం సీజీ వర్క్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. కానీ ఈ సినిమా సీజీ వర్క్ విషయం చాలా కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమా చూస్తున్న ప్రతిసారి అది సీజీ లో చేశారు అనే విషయం మనకు చాలా ఈజీగా తెలిసిపోతోంది. కానీ ఈ సినిమాలో మాత్రం విజువల్స్ చాలా నీట్ గా గ్రాండ్ ఇయర్ గా ఉండడంతో సినిమా మీద హైప్ అయితే పెరిగిపోయింది.
మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక భారీ సక్సెస్ ని సాధిస్తోంది. లేకపోతే మాత్రం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీగా డీలపడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది అనేది తెలియాలంటే మాత్రం ఇంకో 2 రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పటివరకు ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి షో తో ఈ మూవీ పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నట్లైతే భారీ సక్సెస్ ని సాధిస్తోంది. లేకపోతే మాత్రం భారీగా డీలా పడిపోతోంది… ఇంతకుముందు వచ్చిన ‘మహావతార్ నరసింహ’ అలాగే లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు మౌత్ టాక్ తోనే సక్సెస్ ను సాధించాయి. మరి మిరాయి సినిమాకు ఎలాంటి టాక్ వస్తోంది అనేది తెలియాల్సి ఉంది…