Mahesh Babu-Rajamouli: బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేసే ప్రాజెక్ట్ లకు సంబంధించి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతూ వాటి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు కూడా రెండేళ్ళు కేటాయించారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాకు అయితే నాలుగేళ్ళకు పైగా కేటాయించారు. వాస్తవానికి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు పదేళ్ళ క్రితమే ఆయన ప్లాన్ చేసారు. అప్పుడే ఒక కథను మహేష్ బాబు కోసం సిద్దం చేసారు. ఆ కథ కూడా మహేష్ విన్నారని టాక్. అప్పుడు మహేష్ బాబుకి కథలో కొన్ని మార్పులు అడగడంతో అది కాస్తా ఆలస్యం కావడం, మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీ కావడంతో ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు అని సమాచారం.
బాహుబలి సినిమా తర్వాత మహేష్ బాబుతో చేయాలని రాజమౌళి అనుకున్నారు. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు పట్టాలు ఎక్కబోతోంది. ఈ సినిమా కథ ఇప్పటికే సిద్దం కాగా మధ్యప్రదేశ్ లో భారీ సెట్ కూడా నిర్మాణం జరుగుతుందని ఏప్రిల్ తర్వాత షూట్ మొదలుపెట్టె అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు… త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు.
గతంలోనే ఓ ఇంటర్య్వూలో మహేష్ పది సంవత్సరాల క్రితమే మహేష్ బాబు తో సినిమాను చేయాల్సి ఉందని కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చిందని.. ముందు ముందు మహేష్ బాబు తో ఒక భారీ యాక్షన్ అడ్వంచర్ సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. బాహుబలి సినిమాకు ముందు మహేష్ బాబుతో సినిమా అనుకున్నా కూడా అప్పటికి ఉన్న పరిస్థితుల కారణంగా ఆ సినిమా క్యాన్సిల్ చేశారట. బాహుబలి సినిమాకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారట.అంతే కాదు ఆర్ఆర్‌ఆర్ సినిమా కు ముందు కూడా మహేష్ బాబు తో సినిమా అనుకున్నారట రాజమౌళి.
కానీ మల్టీ స్టారర్ ఐడియా రావడంతో మహేష్ బాబు సినిమాను మరి కొంత కాలం వాయిదా వేశామన్నారు జక్కన్న. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేసి తీరుతాను అన్నట్లుగా రాజమౌళి గంట కొట్టినట్లుగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు తో సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటీ అనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే పదేళ్ల పాటు సినిమా వాయిదా పడినా కూడా ఒకసారి రాజమౌళితో సినిమా తీస్తే.. ఆ తర్వాత కెరీర్ మరో లెవల్ లో ఉండడం పక్కా. అయినా సినిమా స్థాయి పెరిగిన ఈ సమయంలోనే మహేష్ తో సినిమా తీయడం బెటర్. మా స్టార్ కు మరింత క్రేజ్ వస్తుందని అంటున్నారు మహేష్ అభిమానులు.